రాంచరణ్ ఎప్పటికీ నా చిట్టిబాబే.. ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చింది.. అనసూయ!
బుల్లి తెరపై అందమైన యాంకర్ గా అనసూయ దూసుకుపోతోంది. కేవలం యాంకర్ గా మాత్రమే కాదు నటిగా కూడా అనసూయ ఆశ్చర్యపరుస్తోంది. 2018 సంవత్సరం అనసూయకు గుర్తుండిపోయే ఏడాది అని చెప్పొచ్చు. ఎందుకంటే రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. అనసూయ నటనకు ప్రశంసలు లభించాయి. నుంతన సంవత్సరం సందర్భంగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. వారడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది.

నా బెస్ట్ మూమెంట్ అదే
అనుమానం లేకుండా ఈ ఏడాది నా బెస్ట్ మూమెంట్ రంగస్థలం చిత్రంలోని రంగమత్త పాత్ర. రాంచరణ్ ఎప్పటికి నా చిట్టిబాబే అంటూ సమాధానం ఇచ్చింది. ఆ చిత్రానికి దక్కిన ప్రశంసలు ఉత్తేజాన్నిచ్చాయి.

ప్రతి నెల 25మందిని
మీరు ట్విట్టర్ లో ఇప్పటివరకు ఎంతమందిని బ్లాక్ చేసారు అనే ప్రశ్నకు అనసూయ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఎం ప్రశ్న అడిగారండి.. ప్రతి నెల 20 నుంచి 25 మందిని బ్లాక్ చేస్తుంటా అని అనసూయ తెలిపింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిస్తారా లేక మంచి పాత్రలకా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తప్పకుండా మంచి పాత్రలకే. కానీ రెండూ కలగలిపిన పాత్రలకు ఎదురుచూస్తున్నా.

వెంకటేష్ సినిమాలో
ఎఫ్2 చిత్రం గురించి మాట్లాడుతూ.. అందులో నాది పూర్తి స్థాయి పాత్ర కాదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తా. ఈ చిత్రం వలన వెంకటేష్ గారితో నటించేలానే నా కల నెరవేరింది. అనిల్ రావిపూడి దర్శత్వంలో నటించే అవకాశం వచ్చింది.

ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చింది
మీరు టివి ఛానల్, నిర్మాణ సంస్థ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అని ఓ అభిమాని ప్రశ్నించాడు. ఏ రూమర్ ఎక్కడి జనుంచి వచ్చిందండీ అంటూ అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇకపై కూడా తాను కీలకమైన పాత్రలు ఎంచుకుంటానని అనసూయ తెలిపింది. కానీ క్షణం తరహా పాత్రలు చేయనని అనసూయ తెలిపింది.


Click it and Unblock the Notifications











