అందరి కంటే భిన్నంగా ఉండాలనే ఆశ.. ఆ రోజు జరిగిందిదే.. అనసూయ కామెంట్స్
బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన నటిగా దూసుకుపోతోంది అనసూయ. అలాంటి అనసూయ చుట్టూ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీ అంశాలు తిరుగుతూనే ఉంటాయి. అనసూయ కనిపించినా, మాట్లాడినా కూడా కొన్ని సార్లు కాంట్రవర్సీకి కేంద్రంగా మారుతుంటాయి. తాజాగా ఆమె జర్నలిస్ట్ స్వప్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను చెప్పుకొచ్చింది.
దిశా పటానీ నాటుగా ఫోటోషూట్.. కళ్లతోనే ఘాటుగా కవ్వింపు

జీఎస్టీ విషయంలో..
జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టానని నా మీద వార్తలు రాశారు. అసలు జరిగింది ఏంటో కూడా తెలుసుకోరు. వాటి మీద నాకు అవగాహన లేక.. మా అకౌంట్ వ్యవహారాలు చూసుకునేవాడు మోసం చేయడంతో కట్టలేకపోయాం. వాటి మీద పెనాల్టీలు పడ్డాయి. జీఎస్టీ ఆఫీసర్లు ఇంటికి వచ్చి అసలు విషయం చెప్పారు. నేను వాటిని కట్టేశాను. కానీ కొన్ని మీడియాలు మాత్రం గందరగోళం చేశాయ్ అని అనసూయ చెప్పుకొచ్చింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డు..
క్షణం సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో నామినేట్ అయ్యాను. కానీ ఈవెంట్‌కు రమ్మని ఆహ్వానం రాలేదు. కానీ రంగమ్మత్త పాత్రకు మాత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అయితే నేను మాత్రం తీసుకోను.. నాకు వద్దు అని దండం పెట్టేశాను అని అనసూయ తెలిపింది.

తమిళ, మళయాలి ఇండస్ట్రీలో..
ప్రస్తుతం నేను కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాను. మాలీవుడ్‌లో మెగాస్టార్ మమ్మూకాతో నటిస్తున్నాను. ఆయన ఎంతో మంచి మనిషి.. ఈ వయసులోనూ ఎంత ఫిట్‌గా ఉంటారు. ఆ సినిమా ఎంతో కళాత్మకంగా ఉంటుంది అని అనసూయ చెప్పుకొచ్చింది.

ప్రత్యేకంగా ఉండాలనే ఆశ..
నాకు మొదటి నుంచి అందరి కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనే ఆశ ఉంటుంది. అందుకే నేను కెరీర్ స్టార్టింగ్‌లోనూ నా జీతం 15 వేలు అయినా కూడా 25 వేలతో ప్రొడక్ట్ పెట్టి కొనుక్కొని మేకప్ వేసుకున్నాను. అలా నన్ను అందరితో కలిపి చూడకండి అని మోస్ట్ డిజైరబుల్ అనే వాటిల్లో నన్ను పెట్టకండి.. ఫాలోవర్ల సంఖ్యను చూసి ఎలా డిసైడ్ చేస్తారు అని అనసూయ చెప్పుకొచ్చింది.

కానీ అలా ఎందుకు..
ఇలాంటి పరిశ్రమలో ఉంటే ఎంతో మంది ఇగోలు సంతృప్తి పరచాల్సి వస్తుంది.. కానీ ఎందుకు.. అలా చేయడం ఎందుకు.. ఎవరి కోరికలు, ఆశలు వారు అదుపులో పెట్టుకోకపోతే వారు మనుషులు ఎలా అవుతారు.. అందరూ ఎదురుతిరిగి, ధైర్యంగా ఉంటే సరిపోతుంది.. మనం ఇక్కడ ఉన్నది ఎవరిని సంతృప్తి పరిచేందుకు కాదు అని అనసూయ తెలిపింది.


Click it and Unblock the Notifications











