అభిమానుల నిరుత్సాహపరిచిన అనసూయ.. స్టేజ్ మీదే బన్నీకి స్వీట్ వార్నింగ్

అనసూయకు ఇప్పుడు వెండితెరపై ఫుల్ గిరాకీ ఏర్పడింది. పలు ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలోనూ నటించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అనసూయ నటించబోయే ప్రాజెక్ట్‌ల గురించి నిత్యం ఏదో ఒక రకమైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఆ సినిమాలో ఆ పాత్రలో కనిపించబోతోందంటూ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలా ఆ మధ్య కొన్ని వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అల్లు అర్జున్, అనసూయ, లావణ్య త్రిపాఠి హంగామా

 అలా రూమర్లు..

అలా రూమర్లు..

ఆ మధ్య అనసూయ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి వచ్చిన వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సిల్క్ స్మిత పాత్రలో అనసూయ కనిపించబోతోందంటూ వార్తలు తెగ హల్చల్ చేశాయి. ఆ తరువాత అవి తప్పుడు వార్తలని తెలిసిపోయింది. మళ్లీ పుష్ప సినిమాలోనూ అనసూయ అదిరిపోయే పాత్రలో కనిపించబోతోందంటూ టాక్ వచ్చింది.

 పుష్పలో అనసూయ..

పుష్పలో అనసూయ..

పుష్ప సినిమాలో అనసూయ నటించబోతోందంటూ ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. రంగమ్మత్త పాత్రను మించిపోయేలా ఉండబోతోందంటూ టాక్ వినిపించింది. అయితే తాజాగా అసలు విషయం చెప్పి అభిమానులను నిరుత్సాహ పరిచింది అనసూయ.

అందరూ అదే ప్రశ్న..

అందరూ అదే ప్రశ్న..

చావు కబురు చల్లగా ప్రమోషన్స్‌కు వెళ్లినా, బయట ఎక్కడ కనిపించినా కూడా పుష్ప సినిమా గురించి అడుగుతున్నారు.. కానీ అందులో నేను నటించడం లేదు అని చెప్పేస్తున్నాను. సుకుమార్ గారు నాకు ఏ పాత్రను ఇవ్వలేదు అంటూ స్టేజ్ మీద స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చేసింది.

డిమాండ్ అనుకున్నా..

డిమాండ్ అనుకున్నా..

అల్లు అర్జున్‌తో కలిసి పని చేయాలని ఉంది.. త్వరలోనే చాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను.. ఇది డిమాండ్ అనుకున్నా పర్లేదు.. నాకు కచ్చితంగా సినిమాలో ఆఫర్ ఇవ్వాల్సిందే అని అనసూయ అలా స్వీట్‌గా వార్నింగ్ ఇవ్వడం.. కింది నుంచి బన్నీ కూడా చేతిని చూపిస్తూ ఓకే అని అనడం బాగానే వైరల్ అవుతోంది.

పుష్ఫలో కాకుండా..

పుష్ఫలో కాకుండా..

అయితే అనసూయ కోరిక పుష్పతో తీరుతుందా? లేదా మరో చిత్రంలోనైనా బన్నీ చాన్స్ ఇస్తాడా? అన్నది చూడాలి. మామూలుగా అయితే పుష్పలో సుకుమార్ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాడని అభిమానులు సంబరపడిపోయారు. కానీ అది నిజం కాదని తెలిపిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X