అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు... అనసూయ షాకింగ్ ట్వీట్

బుల్లితెరపై, వెండితెరపై అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై అందాలను ఆరబోసినా, వెండితెరపై అందరినీ కంటతడి పెట్టించేలా నటించినా అది కేవలం అనసూయకే సొంతం. అయితే వెండితెరపై అనసూయ కేవలం నటిగానే కాకుండా అన్ని రకాలుగా తన ముద్రను వేయాలని నిర్ణయించుకున్నట్టుంది. అందుకే హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, స్పెషల్ సాంగ్స్‌తో హీరోలతో ఆడి పాడుతూ ఉంటుంది.

ఎద అందాలతో విష్ణు‌ప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)

బుల్లితెరపై అలా..

బుల్లితెరపై అలా..

జబర్దస్త్ షోలో అనసూయ చేసే అందాల విందుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్, స్టైలింగ్ ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. క్షణం, రంగస్థలం లాంటి పాత్రలతో తనదైన ముద్రను వేసుకుంది.

వరుస ఆఫర్లు..

వరుస ఆఫర్లు..

ప్రస్తుతం అనసూయ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. వెబ్ సిరీస్‌లు, సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే కృష్ణవంశీ రంగమార్తాండ, రవితేజ ఖిలాడీ, నిహారిక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇక తాజాగా మరో స్పెషల్ సాంగ్‌కు ఓటు వేసినట్టు కనిపిస్తోంది.

గతంలో అలా..

గతంలో అలా..

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్‌ను చేసింది. అందులో తన అందాలను ఓ ఊపు ఊపి ఆ పాటకు, సినిమాకు ఊపునిచ్చింది. కానీ ఆ మూవీ అంతగా వర్కవుట్ కాకపోయినా కూడా స్పెషల్ సాంగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. మళ్లీ ఇలా మరో సాంగ్ కోసం అనసూయ తన కాలుని కదిపేందుకు రెడీ అయింది.

చావు కబురు చల్లగా..

చావు కబురు చల్లగా..

హీరో కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా గురించి అందరికీ తెలిసిందే. బస్తీ బాలరాజుగా కార్తికేయ ఫుల్ మాస్ లుక్కులో కనిపించబోతోన్నాడు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, పాట, టీజర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయబోతోందని ప్రకటించారు

అవసరానికి వాడుకుంటారు..

అవసరానికి వాడుకుంటారు..

చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయబోతోందని నిర్మాతలు ప్రకటించారు. వారు చేసిన ట్వీట్‌పై అనసూయ వెరైటీగా స్పందించింది. "అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు." అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇది పాటలోని లిరిక్స్ అని తెలుస్తోంది.

హీరో రియాక్షన్..

హీరో రియాక్షన్..

ఇక అనసూయ ఇలా స్పెషల్ సాంగ్‌ను చేస్తుండటంతో హీరో కార్తికేయ స్పందించాడు. అనసూయ గారికి స్వాగతం.. మీ రాకతో మా సినిమాకు మరింత అట్రాక్షన్‌ను తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. పండుగ వాతావరణంలా తలపించే ఈ పాట త్వరలోనే రాబోతోందంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X