నేను నిన్ను చాలా మిస్ అవుతాను : అనసూయ.. వాటిపై జాగ్రత్త వహించండి : రష్మీ

డ్రామా జూనియర్స్ అనే ఓ చిన్న పిల్లల ప్రోగ్రామ్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంచి చిన్నారులు తమలో దాగి ఉన్న టాలెంట్‌ను బయటపెట్టారు. వారు వేసే స్కిట్‌లు నవ్వించాయి.. కన్నీళ్లు తెప్పించాయి.. ఆలోచింపజేశాయి. అలాంటి ఓ చిన్నోడు నేడు కన్నుమూశాడు. దీంతో ఎంతో మంది సెలెబ్రెటీలు సంతాపాన్ని తెలుపుతున్నారు.

బాలయ్య డైలాగ్‌లతో అదరగొట్టిన గోకుల్...

బాలయ్య డైలాగ్‌లతో అదరగొట్టిన గోకుల్...

డ్రామా జూనియర్స్, సోషల్ మీడియాలో బాలయ్య డైలాగ్‌లు చెబుతూ.. మ్యానరిజంతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. బాలయ్యను కూడా మెప్పించి జూనియర్ బాలయ్యగా ఫేమస్ అయ్యాడు. అయితే డెంగీ సోకడంతో ఆకస్మకంగా మృత్యువాత పడ్డాడు. దీంతో అందరి నవ్వులు మూగబోయాయి.

మనస్థాపానికి గురైన బాలయ్య..

మనస్థాపానికి గురైన బాలయ్య..

బుడ్డోడి మరణ వార్త విన్న బాలయ్య.. మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు.అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణమిచ్చే ఆ చిన్నారి ప్రాణాలతో లేడన్న విషయం నా మనుసును కలిచి వేసిందంటూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ ప్రకటించాడు.

నేనొంతో బాధకు గురయ్యాను...

అనసూయ స్పందిస్తూ.. నేను నిన్ను ఎంతగానే ప్రేమించాను.. మీ తల్లిదండ్రులకు బలాన్ని ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.. పిల్లల ఇష్టాన్ని తెలుసుకుని ఆ దిశగా ప్రోత్సహించిన మీలాంటి పేరెంట్స్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇకపై నేను నిన్ను ఎంతగానే మిస్ అవుతాను అంటూ ఎమోషనల్ అయింది.

వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి..

రష్మీ స్పందిస్తూ... అనసూయ ద్వారా నేను తెలుసుకున్న ఈ విషయంతో నేను కృంగిపోయాను. డెంగీ ద్వారా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.. వాటిపై అవగాహన పెంచుకోండి.. జాగ్రత్త వహించండి.. చిన్నారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X