అలా ఉంటే మాక్కూడా ఎంకరేజింగ్‌గా ఉంటుంది.. అనసూయ కామెంట్స్

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఎంతటి పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంటుంది. దాదాపు ప్రతీ రోజూ అనసూయ మీద ఏదో రకమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమె చేసే పోస్ట్‌లు, ఫోటోలు, చేసే కామెంట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అనసూయ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

తాజాగా అలా..

తాజాగా అలా..

అనసూయ మొదటగా పని చేసింది సాక్షి చానెల్‌లో అని అందరికీ తెలిసిందే. అలా సాక్షిలో పనిచేసిన జర్నలిస్ట్ స్వప్నకు తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మామూలుగా అయితే అనసూయ మీడియా ముందుకు రావడం గానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయదు. అలాంటి అనసూయ స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.

అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

నాటి విషయాలు..

నాటి విషయాలు..

అనసూయ ఆ ఇంటర్వ్యూలో అన్ని విషయాలపై స్పందించింది. జీఎస్టీ ఎగ్గొట్టిందంటూ రాసిన వార్తలపై, తన బాడీపై, బాడీ షేమింగ్‌పై చేసే ట్రోలింగ్, అత్తారింటికి దారేది సమయంలో వచ్చిన ట్రోలింగ్ ఇలా ప్రతీ ఒక్క విషయంపై అనసూయ స్పందించింది.

యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

పొట్ట గురించి..

పొట్ట గురించి..

తన పొట్ట గురించి నెటిజన్లు చేసే ట్రోలింగ్ గురించి అనసూయ కాస్త ఘాటుగా స్పందించింది. తన పొట్ట గురించి కామెంట్లు చేస్తారు.. అంత ఉంది.. అని.. అలా ఉంది కాబట్టి నా పిల్లలు బాగా పుట్టారు..అది వారికి ఇళ్లు లాంటిది అని అనసూయ చెప్పుకొచ్చింది.

అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

 మీమ్స్ కూడా అలా..

మీమ్స్ కూడా అలా..

అనసూయ చేసిన ఈ కామెంట్లపై పాజిటివ్ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే పాజిటివ్‌గా వేసిన ఈ మీమ్‌పై అనసూయ ఫుల్ ఖుషీ అయింది. మామూలుగా అయితే నెగెటివ్ కామెంట్లు చేస్తే.. వెంటనే బ్లాక్ చేయడమో తిట్టడమో చేస్తుంటుంది అనసూయ. ఇలా పాజిటివ్‌గా మీమ్స్ వేసినప్పుడు ఫుల్ హ్యాపీ అవుతుంది.

Recommended Video

The Fog Movie Theatrical Trailer
మాక్కూడా ఎంకరేజింగ్..

మాక్కూడా ఎంకరేజింగ్..

అలా తన మీద వేసిన పాజిటివ్ మీమ్‌పై అనసూయ స్పందించింది. మీమ్స్ అంటే ఇలా ఉంటే.. కొంచెం మాక్కూడా ఎంకరేజింగ్‌గా ఇంకా బాగా కరెక్ట్‌గా ఉండాలని ఉంటుంది.. కదా మరి అంటూ చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియా అంటే పాజిటివ్, నెగెటివ్ ఉంటుందన్న విషయం రంగమ్మత్త ఇంకా అర్థం చేసుకోలేదేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X