రష్మీ గౌతమ్, అనసూయ ఇద్దరికీ నిరాశే.. అయ్యో పాపం! ఇలా జరిగిందేంటో..

కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై అందాల విందు ఇవ్వొచ్చు అని ప్రూవ్ చేశారు యంగ్ యాంకర్లు రష్మీ గౌతమ్, అనసూయ. చిన్ని తెరపై ఈ ఇద్దరి హంగామా చూసిన దర్శకనిర్మాతలు వారికి సినిమా ఛాన్సులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరంలో సినిమాల రూపంలో ఈ ఇద్దరికీ నిరాశే మిగిలింది. అందుకు సంబంధించిన వివరాలు చూద్దామా..

ముద్దుగుమ్మలిద్దరూ అట్టర్ ఫ్లాప్

ముద్దుగుమ్మలిద్దరూ అట్టర్ ఫ్లాప్

తెలుగు టెలివిజన్ రంగంలో సంచ‌ల‌నాలకు మారుపేరైన రష్మీ గౌతమ్, అనసూయ వెండితెరపై మాత్రం డీలా పడ్డారు. 2019 సంవత్సరం వీళ్లకు పెద్దగా కలిసిరాలేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఇద్దరి అందాలకు అంతగా ప్రియారిటీ ఇవ్వలేదు. అనసూయ 'కథనం' సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకోగా, రష్మీ 'శివరంజని' రూపంలో అట్టర్ ఫ్లాప్ అయింది.

అనసూయ లీడ్ రోల్‌.. తీవ్ర నిరాశ

అనసూయ లీడ్ రోల్‌.. తీవ్ర నిరాశ

రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో అనసూయ లీడ్ రోల్‌లో రూపొందింది 'కథనం' మూవీ. ఈ చిత్రానికి బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా నిర్మాతలుగా వ్యవహరించారు. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలు సంయుక్తంగా సమర్పించాయి. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలై ఫ్లాప్ అయింది.

రష్మీ గౌతమ్ రొమాంటిక్ ట్రీట్.. అయినా కూడా

రష్మీ గౌతమ్ రొమాంటిక్ ట్రీట్.. అయినా కూడా

ఇక మరో యాంకర్ రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో అదే నెల ఆగస్టులో రిలీజయ్యింది 'శివరంజని' సినిమా. రొమాంటిక్, హారర్ సినిమాగా నాగ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన దాంట్లో కొద్దిమేర కూడా పర్‌ఫార్మ్ చేయలేదు. రష్మీ ఇచ్చిన అందాల విందు, రొమాంటిక్ ట్రీట్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీలు

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీలు

ఇలా ఈ హాట్ భామలకు 2019 సంవత్సరం తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ ఇద్దరికీ లక్షల్లో అభిమానులు ఉన్నప్పటికీ కలిసి రాలేదు. వెండితెర సంగతి అటుంచితే ఇక బుల్లితెరపై మాత్రం ఫుల్ జోష్ ప్రదర్శించారు ఈ జబర్దస్త్ బ్యూటీలు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హవా కొనసాగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X