ఖతర్‌లో అనసూయ.. వావ్! అనిపించేలా మతిపోగోట్టే ఖతర్నాక్ లుక్
హాట్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీ ఎవరు అంటే ముందుగా ఈమె పేరే చెప్పుకోవాలి. యాంకర్‌గా బుల్లితెరపై, యాక్టర్‌గా వెండితెరపై అనసూయ జోరు కొనసాగుతోంది. పైగా ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టీవ్ గా ఉంటున్న ఈమె తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్‌తో మతిపోగెట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తాజా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖతర్‌లో అనసూయ
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుండి ఖతార్‌లోని దోహాలో జరగనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ అవార్డుల వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేస్తుండగా.. టాలీవుడ్ నుంచి ఎంతోమంది నటీనటులు అటెండ్ అవుతున్నారు. తాజాగా అనసూయ కూడా ఖతర్‌లో వాలిపోయింది.
వావ్! మతిపోగోట్టే ఖతర్నాక్ లుక్
సైమా వేడుకకు హాజరయ్యేందుకు ఖతర్ వచ్చిన అనసూయ మరోసారి కుర్రకారు మతిపోగెట్టేసింది. చూడగానే వావ్! అనిపించేలా ఖతర్నాక్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. రెడ్ కలర్ ఇన్నర్ వేసి దాని మీదుగా చుక్కల షర్ట్ ధరించి సెక్సీ లుక్‌లో అనసూయ కనిపించింది. రంగమత్త ఫోటోలంటేనే కుర్రకారుకు యమ కిక్కు.. పైగా ఇలా కనిపిస్తే ఇక ఊరుకుంటారా? వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్స్
అనసూయ వేసుకుంటున్న డ్రెస్సింగ్‌సెన్స్‌పై కొందరు విరుచుకుపడుతూ తెగ విమర్శిస్తున్నారు. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఈమె ఇలాంటి బట్టలేసుకోవడమేంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే అనసూయ మాత్రం తన లైఫ్ స్టైల్ తనదే అని, తనకు అన్ని లిమిట్స్ తెలుసు అని విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ వస్తోంది.

జోరుగా అనసూయ ప్రయాణం
బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అనసూయ ప్రయాణం జోరుగా సాగుతోంది. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం'లో ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది అనసూయ. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన 'కథనం' మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











