హేబా పటేల్ షాకిచ్చింది..హాట్ యాంకర్ కు పండగ!
టాలీవుడ్ హాట్ హీరోయిన్లలో హేబా పటేల్ కూడా ఒకరు. కుమారి 21 ఎఫ్ చిత్రం తరువాత ఇండస్ట్రీ చూపు మొత్తని తనవైపు తిప్పుకుంది ఈ భామ. కుమారి 21 ఎఫ్ చిత్రం తరువాత హేబా పటేల్ కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వాటిలో కొన్ని విజయాలు, పరాజయాలు ఉన్నాయి. ఇటీవల సరైన హిట్ లేకపోవడంతో హేబా పటేల్ కు అవకాశాలు తగ్గాయి.
హేబా పటేల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం హాట్ యాంకర్ అనసూయకు వరంగా మారినట్లు తెలుస్తోంది. సోలో హీరోయిన్ కథతో ఓ దర్శకుడు హేబా పటేల్ ని సంప్రదిస్తే రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఆఫర్ అనసూయకు దక్కినట్లు తెలుస్తోంది. అనసూయ పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అనసూయ రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చి 30 న విడుదలకు సిద్ధం అవుతోంది.



Click it and Unblock the Notifications











