వేశ్య పాత్ర అనగానే అలాంటి డౌట్స్.. బోల్డ్ క్యారెక్టర్ గురించి అనసూయ దిమ్మ తిరిగే జవాబు

రంగస్థలంలో రంగమ్మత్త, పుష్పలో దాక్షయిని పాత్రలో ఆకట్టుకొన్న యాంకర్, యాక్టర్ అనసూయ తాజాగా విమానం చిత్రంలో సుమతి అనే వేశ్య పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు శివ ప్రసాద్ రూపొందించిన విమానం సినిమాలోని సుమతి పాత్రకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు నిమ్మకాయల ప్రసాద్, కిరణ్ కొర్రపాటి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ..

నేను అన్ని సినిమాలు చూస్తాను. సుమతి పాత్ర చెప్పినప్పుడు కేవలం దర్శకుడు శివ ప్రసాద్, నిర్మాత కిరణ్ కొర్రపాటి డిజైన్ చేసిన పాత్రను అర్ధం చేసుకొని నటించాను. సుమతి పాత్ర ఇలా కావాలని అలా చెప్పినప్పడు నా డిజైనర్ కలిసి కొంత హోం వర్క్ చేశాం. సుమతి పాత్రను మాత్రమే చూపించాలని అనుకొన్నాం. వేరే వారి మాదిరిగా చూపించాలనే ప్రయత్నం చేయలేదు అని అనసూయ అన్నారు.

 Anasuya Bharadwaj

బోల్డ్ అనే పదం నిజంగా ఇప్పటికీ అర్ధం కాదు. ఈ పాత్ర ఒప్పుకొంటే అందరూ ఏమనుకొంటారో అనే చిన్న భయం ఉంటుంది. కానీ శివ ప్రసాద్ చెప్పిన తర్వాత నేను మాత్రం ఒక్క సెకన్ కూడా ఆలోచించలేదు. కేవలం పాత్రను మాత్రమే చూశాను. క్షణం మూవీలో పిల్లల్ని ఎత్తుకుపోయే పాత్ర. అంత మాత్రాన పిల్లల్ని ఎత్తుకు పోతానా? సముద్రఖని గారు విలన్ పాత్ర వేసి వేరే వాళ్లను పొడిచేస్తారు..అంత మాత్రాన బయట ఆయన పొడిచేయరు కదా అని అనసూయ సమాధానం ఇచ్చింది.

 Anasuya Bharadwaj

నేనేంటో నాకు తెలుసు. నా ఫ్యామిలికి ఇంకా బాగా తెలుసు. మీరు నమ్మితే మీకు నా గురించి బాగా తెలుసు. నేను ఒక పాత్రను బ్యూటిఫుల్ సినిమాలో చేశానని అనుకొన్నాను. నేను ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఈ పాత్రను చేసే ముందు ఒకటే ఆలోచించాను. తమిళంలో గతంలో వేశ్య పాత్రను చేశాను గుర్తు చేసుకొన్నాను అని అనసూయ చెప్పింది.

తమిళ సినిమాలో చేసిన అలాంటి పాత్ర మాదిరిగానే సుమతి పాత్ర ఉంటుందా? సుమతి పాత్రను ఎలా రిసీవ్ చేసుకొంటారోనని ఆలోచించాను. మళ్లీ వేశ్య పాత్ర అంటే ఆడియెన్స్ బోర్ అయిపోతారా? అని ఆలోచించాను. శివ ప్రసాద్‌తో మాట్లాడితే నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పారని అని అనసూయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X