అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న నటి అనసూయ భరద్వాజ్. ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ... కొందరు సినీ హీరోల ఫ్యాన్స్‌తో నిత్యం పోరాడుతుంటారు. హీరోల ఫ్యాన్స్ చేసే ట్రోల్స్‌ను భరిస్తూ ధీటుగా జవాబు చెబుతుంటారు. అయితే తాజాగా మహిళలు ధరించే దుస్తులు వల్లనే మానభంగాలు జరుగుతున్నాయనే వాదనకు వ్యతిరేకంగా తన అభిమానులు పెట్టిన పోస్టుపై ఆమె ఎమోషనల్‌గా స్పందించారు. ఆమె పెట్టిన పోస్టు వివరాల్లోకి వెళితే..

అనసూయ ధరించే దస్తులపై గతంలో కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇలాంటి దుస్తులు ధరించడం వల్లే మహిళలపై మానభంగాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై జరిగే రేప్‌లకు మగవారు కారణం కాదు. వారిపై కామెంట్స్ చేయకూడదు. మీరు దుస్తులు సరిగా ధరిస్తే ఇలాంటి అనర్ధాలు జరగవనే చర్చ గతంలో జరిగింది.

Anasuya Bharadwaj befitting Reply to Social media trollers with her Emotional post

అయితే తన అభిమాని తాజాగా పెట్టిన పోస్టును చూసి అనసూయ ఎమోషనల్ అయింది. అమ్మాయిలు స్కర్ట్ వేసినా.. లేదా సంప్రదాయంగా దుస్తులు వేసినా.. ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరి మానభంగానికి మహిళలు గురవుతున్నారు. అమ్మాయిలు ధరించే దుస్తుల వల్ల కాదు.. మన మైండ్ సెట్ మార్చుకొంటే.. మహిళలపై రేప్‌లు ఆగుతాయి అని పోస్టు పెట్టారు.

తన అభిమాని పెట్టిన పోస్టు చూసిన అనసూయ స్పందిస్తూ.. నేను నా వాళ్లు అనుకొనే వాళ్లు వీళ్లు. నన్ను అభిమానించే వాళ్లు కొందరి ఫ్యాన్ పేజీల మాదిరగా ఎవరిని దూషించరు. ఎవరిని టార్గెట్ చేయరు. ఎవరిని ట్రోల్ చేయరు. ఎవరిని రెచ్చగొట్టరు. అనవసరంగా ఎవరిని అగౌరవపరచరు. వీళ్లు వారి భాధ్యతల నుంచి పారిపోరు. మంచి మనసుతో ఉండే వారిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది అని అనసూయ అన్నారు.

Anasuya Bharadwaj befitting Reply to Social media trollers with her Emotional post

ఇక కొందరు ఫ్యాన్స్ పేజీలు మెయింటెన్ చేసేవారు గుమ్మడికాయల దొంగలు. అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్లు జంతువులుగా బిహేవ్ చేస్తుంటారు. అయినా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా మంచి మనుషులు. వారికి నేను అండగా ఉంటాను. వారిని ఎల్లప్పుడూ ప్రేమిస్తాను అని అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X