HDB Anasuya: టాప్ యాంకర్ నుంచి రంగమ్మత్త వరకు.. ఫస్ట్ క్రష్‌తోపాటు అనసూయ క్రేజీ సీక్రెట్స్!
ఏకకాలంలో అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. అందంతో పాటు అభినయం కనబరచ గల నేర్పు ఉంది కాబట్టే.. తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. మధ్యలో కొన్ని వివాదాలు చెలరేగినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకెళ్తోంది. ఇదిలాఉండగా.. అనసూయ శుక్రవారం (మే 15)న పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గురించి తెలుసుకుందాం!

ఒకే ఒక్కటి ఆమె జీవితాన్ని మార్చేసింది
చిన్న చిన్న పాత్రల్లో నటించి సినీ కెరీర్‌ను ఆరంభించింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసిన ఆమెకు.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ‘జబర్ధస్త్' యూనిట్ నుంచి అవకాశం వచ్చింది. అందులోకి ఎంటర్ అయిన తర్వాత అనసూయ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది.

రంగమ్మత్త చూపించింది.. బిజీ అయింది
కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ నటించిన ‘నాగ' అనే సినిమాలో నటించిన అనసూయ... ఆ తర్వాత నాగార్జున చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన'లో మెరిసింది. అనంతరం ‘క్షణం' అనే మూవీలో ఆమె చేసిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక, రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం'లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రతో తనలోని ఉత్తమ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది అనసూయ.

ఎప్పుడూ అక్కడే... భారీగా విమర్శలు
వరుస టీవీ షోలు.. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో అనసూయపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.

స్పైసీగా రంగమ్మత్త.. ఆయనకు దాసి
2019లో అనసూయ ‘కథనం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత అనసూయ.. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె దేవదాసిగా స్పైసీ రోల్ చేస్తుందని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

జబర్ధస్త్ కమెడియన్‌తో రంగమ్మత్త
జబర్ధస్త్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తుండడంతో అనసూయపై టీమ్ లీడర్లు తరచూ పంచులు పేలుస్తున్నారు. ఈ షోలో గ్లామర్ పంట పండిస్తూ ఆకట్టుకొంటున్నారు. అలాగే టీమ్ లీడర్లపై సెటైర్లు వేస్తూ జబర్దస్త్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ షోలో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునేది అనసూయనే అని అంటుంటారు.
Recommended Video

ఆ సీనియర్ హీరో ప్రేమలో అనసూయ
కొన్నేళ్ల క్రితం అనసూయ.. తన ఫస్ట్ క్రష్ గురించి ఓ విషయాన్ని బయట పెట్టింది. దీని గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు శంకర్ తీసిన ‘జెంటిల్‌మెన్' సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చూసిన తర్వాత హీరో అర్జున్ గారితో ప్రేమలో పడిపోయా. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా ఫస్ట్ షోనే చూసేదాన్ని' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











