అనసూయ ప్రామిస్.... చెర్రీ, సుకుమార్‌లకు చేదు వంటకం!
రామ్ చరణ్ గురించి యాంకర్ అనసూయ చాలా ఆసక్తికర విషయాలు తెలిపారు. ఏ విషయం అయినా త్వరగా నేర్చుకుంటాడని తెలిపింది. ప్రస్తుతం అనసూయ చెర్రీ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తోంది. చెర్రీకి, సుకుమార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనసూయ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... షూటింగ్ విశేషాలను, షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్ గురించి తాను గ్రహించిన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తన రోల్ ఏమిటనే విషయం చెప్పబోనని, అయితే చాలా ఎంటర్టెనింగ్‌గా ఉంటుందని అనసూయ తెలిపారు.

రామ్ చరణ్ గురించి
ఏ విషయం అయినా చరణ్ చాలా తొందరగా నేర్చుకుంటాడు. కొత్త విషయాల పట్ల చిన్న పిల్లాడి మాదిరిగా చాలా ఎగ్జైట్మెంటుతో ఉంటారు... అని అనసూయ చెప్పుకొచ్చారు.

ఫుడ్, సినిమాల గురించే
'రంగస్థలం' సినిమా సెట్ లో తామంతా ఆహారం, సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నామని చెప్పింది... అనసూయ తెలిపారు.

ప్రామిస్ చేశానంటున్న అనసూయ
తాను కాకరకాయలతో చేసే (భర్వాన్ కరేలా) వంటకం బాగా చేస్తానని... దాన్ని చేసుకుని తీసుకువస్తానని చరణ్, సుకుమార్ లకు ప్రామిస్ చేశానని అనసూయ తెలిపారు. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ లో వారికి ఈ వంట వండి పెడతానని అనసూయ తెలిపారు.

చెర్రీకి మరో స్వయంకృషి అవుతుంది
మెగా స్టార్ చిరంజీవికి 'స్వయం కృషి' సినిమా ఎలాగో.... రామ్ చరణ్‌కు 'రంగస్థలం 1985' ఆ రేంజి సినిమా అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తున్నాడు
నాకు ఇప్పటి వరకు రామ్ చరణ్ ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఈ సినిమా ద్వారా నటుడిగా అతడిని చాలా దగ్గరనుండి చూస్తున్నాను. ఈ సినిమాను హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తున్నాడు. అతడి కమిట్మెంట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది అని అనసూయ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











