మా ఆయన బంగారం.. అవేమీ పట్టించుకోరు.. బర్త్ డేన అనసూయ సూపర్ డిసిషన్
యాంకర్ అనసూయ బర్త్ డే వేడుకలు కుటుంబ సభ్యులు, సామాజిక కార్యక్రమాల మధ్య జరిగాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా ఆమె నిరాడంబరంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నారు. పేదలకు, గర్బిణిలకు పండ్లను, ఫుడ్‌ను కుటుంబ సభ్యులతో పంచిపెట్టారు. అనసూయ సెలబ్రేషన్ ఎలా జరిగాయంటే..

పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి
తన ఇద్దరు పిల్లలు, భర్తతో జన్మదినాన్ని సంతోషం, ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. పిల్లలు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్టులను చూసి అనసూయ మురిసిపోయారు. వాటిని భర్తతో కలిసి సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించి బర్త్ డేను ఆహ్లాదంగా గడిపారు.

గర్బిణీ స్త్రీలకు ఆసరాగా
అనసూయ తన జన్మదినం రోజున సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొన్నారు. ఇక నుంచి గర్బిణీ స్త్రీలకు ఆమె అండగా నిలువాలని నిర్ణయం తీసుకొన్నారు. అమ్మతనాన్ని పంచబోయే గర్బిణి మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని, అలాగే వారికి ఆసరగా నిలువాలని డిసైడ్ అయ్యారు. అనసూయ తీసుకొన్న నిర్ణయం పట్ల నెటిజన్లు, అభిమానులు ప్రశంసించారు.

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ
ఇక భర్తతో కలిసి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సామాజిక సేవలో పాల్గొన్నారు. మాస్కులు, చేతికి గ్లౌవ్స్ ధరించి స్వచ్చంద సేవ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. పోలీసుల సహకారంతో మహిళలకు పండ్లు పంచిపెట్టారు. ఈ విషయాలను అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. పలు ఫోటోలను తన ఇన్స్‌టాలో షేర్ చేశారు.
Recommended Video

మా ఆయన బంగారం..
జన్మదినం సందర్భంగా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతుండగా అకతాయి చేసిన అల్లరికి గట్టిగా బుద్ది చెప్పింది. అలాగే కొందరు మగాళ్లు అమ్మాయిలను, మహిళలను ఇలా ఉండాలి.. అలా ఉండాలని ఒత్తిడి, డిక్టేట్ చేస్తుంటారు. కానీ నా భర్త బంగారం. ఆయన అలాంటి పనులు చేయరు. నాకు ఇష్టం వచ్చినట్టు ఉండేలా చూసుకొంటారు అని అనసూయ తెలిపారు.


Click it and Unblock the Notifications











