సైరా సక్సెస్‌లో భాగమైన అనసూయ.. మెగాస్టార్ చేయిపట్టి సెన్సేషన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకున్న సైరా నరసింహా రెడ్డి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా దేశ విదేశాల్లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సరికొత్త రికార్డులకు తెరలేపుతూ భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్, ఇతర చిత్రయూనిట్ ఇండియాలో హంగామా చేస్తుంటే.. యాంకర్ అనసూయ మాత్రం అమెరికాలో సైరా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తోంది. వివరాల్లోకి పోతే..

ఇక్కడ చిరు.. అక్కడ అనసూయ

ఇక్కడ చిరు.. అక్కడ అనసూయ

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో సంబరాలు చేసుకుంటోంది చిత్రయూనిట్. ఈ మేరకు నిన్ననే (గురువారం) థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది. ఈ వేదికపై చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా మాట్లాడి సైరా విశేషాలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో కూడా 'సైరా' సందడి నెలకొంది. అది కూడా అనసూయ చేస్తుండటం విశేషం.

 ఇటు దసరా.. అటు సైరా

ఇటు దసరా.. అటు సైరా

తెలుగుతో పాటు ఇతర నాలుగు భాషల్లో విడుదలైన 'సైరా' విజయాన్ని అమెరికా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు దసరా పండుగ, అటు సైరా పండుగ రెండూ ఒకేసారి రావడంతో వాషింగ్టన్ లోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో బుల్లితెర హాట్ యాంకర్ కూడా భాగం కావడం విశేషం.

సైరా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ అనసూయ

సైరా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ అనసూయ

అమెరికా లోని వాషింగ్టన్ నగరంలో జరిగిన సైరా సెలెబ్రేషన్స్‌లో యాంకర్ అనసూయ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అక్కడి తెలుగు ప్రజలను తన మాటలతో ఎంటర్‌టైన్ చేస్తూ కిక్కిచ్చింది. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి పోస్టర్ తో మ్యాజిక్ చేసింది అనసూయ. పోస్టర్‌లో మెగాస్టార్ చేయిపట్టి నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తొలిరోజే రికార్డు స్థాయిలో

తొలిరోజే రికార్డు స్థాయిలో

మరోవైపు కలెక్షన్స్ పరంగా సైరా జోష్ మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.

Recommended Video

Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Success Meet | మహేష్ బాబు,రాజమౌళి కి చాలా నచ్చింది!!
సైరా 100 కోట్ల మార్క్

సైరా 100 కోట్ల మార్క్

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసింది సైరా నరసింహా రెడ్డి మూవీ. అక్టోబర్ 2న విడుదలైన సైరా.. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో సైరా సునామీ చూడనున్నామని అంటున్నారు.

సైరా నరసింహా రెడ్డి విశేషాలు

సైరా నరసింహా రెడ్డి విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X