పవన్ కళ్యాణ్ తో అనసూయ డ్యాన్స్.. ‘జబర్దస్త్’ మాజీ యాంకర్ మడతెట్టేసిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రజలకు పాలన అందిస్తున్నారు. ఓవైపు ప్రజాసేవను కొనసాగిస్తూనే మరోవైపు తన సినిమాలను కూడా పూర్తి చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే రెండేళ్లకు ముందే పవన్ కళ్యాణ్ సైన్ పెట్టిన సినిమాలను రాజకీయ కార్యక్రమాలతో సమయం లేకున్నా.. బాధ్యతగా చిత్రాలను పూర్తి చేస్తున్నారు. అందులో ప్రధానంగా నాలుగేళ్ల కింద ప్రారంభమై నేటికీ విడుదల కానీ చిత్రం 'హరిహర వీరమల్లు : పార్ట్ 1', ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్, ఏఎం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో బ్రేక్ లు పడుతున్న ఈ ప్రాజెక్ట్ కు ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.

హరిహర వీరమల్లు : పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్... చిత్రం ఇఫ్పటికే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం. రత్నం సమర్పించగా.. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అదిరిపోయే గ్లింప్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు. మొదట వచ్చిన 'మాట వినాలి' సాంగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Anasuya Bharadwaj Dance with Powerstar Pawan Kalyan Interesting song from Hari Hara Veera Mallu

కాగా.. తాజాగా రెండో సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదలై ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ లో 'జబర్దస్త్' మాజీ యాంకర్ అనసూయ స్పెషల్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. బుల్లితెరపై అనసూయ తన డ్యాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. అలాగే గతంలోనూ సాయిధరమ్ తేజ్ చిత్రంలో 'సూయ సూయ అనసూయ' అనే సాంగ్ లోనూ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ కు మరింత కిక్కునిస్తోంది.

అనసూయ ప్రస్తుతం వెండితెరపైనే వరుస చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెరకు గుడ్ బై చెప్పినప్పటి నుంచి భారీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక హరిహర వీరమల్లు చిత్రంలో 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ తో ఎలా అలరించబోతుందో చూడాలంటున్నారు. ఈ సాంగ్ పుల్ వీడియో ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫుల్ వెర్షన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj Dance with Powerstar Pawan Kalyan Interesting song from Hari Hara Veera Mallu

ఆస్కార్ అవార్డు విన్నర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి 'హరిహర వీరమల్లు' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ కు అద్భుతమైన ట్యూన్ అందించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగానే లిరిక్స్ కనిపిస్తున్నాయి. 'కొరా కొరా మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో..' అంటూ సాగే ఈ పాట 2025లో సెన్సేషన్ గా నిలవబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మొఘల్ కాలంలో కోహినూర్ వజ్రాన్ని దొంగలించే నేపథ్యంలో హరిహర వీరమల్లు పార్ట్ :1 కథ ఉండనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X