అన్నీ మూసేసిన అనసూయ: ఇకనైనా మారకపోతే.... కెరీర్‌ దెబ్బతింటుంది!

By Bojja Kumar

Recommended Video

అనసూయ కఠిన నిర్ణయం ..

అనసూయ భరద్వాజ్.... యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఈ రంగంలో టాప్ రేంజికి ఎదిగిన వెరీ వరీ టాలెంటెడ్ పర్సన్. తన అందం, చలాకీతనం, చిలిపి చేష్టలతో యాంకరింగుకే కొత్తసొగబులు అద్దిన బ్యూటీ. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగానూ తనను తాను నిరూపించుకుంటూ దూసుకెళుతున్నారు. ఇక అనసూయకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఏ రేంజిలో ఉండేవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు.

 మూగబోయిన అనసూయ

మూగబోయిన అనసూయ

ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో తన అభిమానులను, ఫాలోవర్స్‌ను అనసూయ ఎంటర్టెన్ చేసేవారు. అయితే దాదాపు నెల రోజులుగా అనసూయ సోషల్ మీడియా పేజీలన్నీ మూగబోయాయి. దీంతో అనసూయ నుండి ఎలాంటి అప్ డేట్స్ అందక పోవడంతో తమ అభిమాన యాంకర్ ఏం చేస్తోందో తెలియక ఫ్యాన్స్ అంతా అసంతృప్తితో ఉన్నారు.

 విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ధైర్యంగా

విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ధైర్యంగా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ పలు సందర్భాల్లో తాను స్ట్రాంగ్ లేడీ అని నిరూపించుకున్నారు. ప్రశంసలు స్వీకరిస్తూనే.... ఎవరైనా తన గురించి ఏమైనా విమర్శలు చేస్తూ వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూ తన మనో ధైర్యాన్ని చాటుకునేవారు.

ఆ సంఘటనతో....

ఆ సంఘటనతో....

అయితే నెల రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన అనసూయను సోషల్ మీడియాకు దూరం చేసింది. పదేళ్ల బాలుడు తన తల్లితో కలిసి వెళుతుండగా అనసూయను చూసి సెల్పీకోసం ప్రయత్నించాడు. అయితే బాలుడి పట్ల అనసూయ కఠినంగా ప్రవర్తించడం, పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఫోన్ బద్దలు కొట్టడంతో ఆమెపై సోషల్ మీడియాతో విమర్శల వర్షం కురిసింది.

 అన్నీ మూసేసిన అనసూయ

అన్నీ మూసేసిన అనసూయ

నెలరోజుల క్రితం జరిగిన సంఘటనతో తనపై సోషల్ మీడియాలో అన్ని వైపుల నుండి విమర్శలు, కామెంట్ల దాడి ప్రారంభం కావడంతో అనసూయ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు మూసి వేసింది. నెల రోజులైన ఆమె వాటిని ఓపెన్ చేయకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

 ఈ హాట్ యాంకర్ మనసు ఇక ఎప్పటికీ మారదా?

ఈ హాట్ యాంకర్ మనసు ఇక ఎప్పటికీ మారదా?

సోషల్ మీడియా ఖాతాల విషయంలో అనసూయ ఇంత కఠినంగా వ్యవహరించడం తగదని, ఇప్పటికైనా అనసూయ మనసు మార్చుకుని మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని.... తమను ఎంటర్టెన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 ఆ ప్రమాదం కూడా ఉంది

ఆ ప్రమాదం కూడా ఉంది

ఇప్పుడంతా సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. అనసూయ ఇందులో మళ్లీ యాక్టివ్ కాకపోతే తన ఫేమ్ కోల్పోయే అవకాశం ఉందని, ఇది ఆమె కెరీర్ మీద దెబ్బ పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 అనసూయ దూరం కావడానికి ఈ సంఘటనే కారణం

అనసూయ దూరం కావడానికి ఈ సంఘటనే కారణం

నెలరోజుల క్రితం హైదరాబాద్ తార్నాక ప్రాంతంలోని తన పుట్టింటికి అనసూయ వెళ్లారు. అదే సమయంలో తన తల్లితో పాటు అటుగా వెళుతున్న ఓ బాలుడు అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. దీంతో యాంకర్ అనసూయ కోపోద్రిక్తురాలై బాలుడి చేతిలోని ఫోన్ లాక్కుని నేలకేసి బద్దలు కొట్టినట్లు ఆరోపణ.

 అనసూయ వివరణ

అనసూయ వివరణ

ఆ సంఘటనపై అనసూయ మరుసటిరోజే వివరణ ఇచ్చారు. ఇలాంటి దానికి నేను వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. మా అమ్మను కలిసేందుకు తార్నాక వెళ్లాను. అక్కడ నేను కారు దిగి నడుచుకుంటూ వెళుతుంటే ఓ ఉమెన్, వాళ్ల బాబు స్కూటీ మీద వెళుతూ నా వీడియో తీశారు. అలా చేయవద్దని చెప్పాను. నెక్ట్స్ టైమ్ వచ్చినపుడు సెల్ఫీ ఇస్తానని చెప్పాను. నేను ఎంత చెప్పినా వారు వినలేదు. బైక్ నా ముందు వరకు వచ్చి వీడియో తీయడానికి ట్రై చేశారు. నేను నా ఫేస్ కవర్ చేసుకున్నాను. కొంచెం కోపంగా తిట్టాను, కానీ ఫోన్ పగలగొట్టలేదు. ఆ అబ్బాయిని కూడా ఏమీ అనలేదు.... అని అనసూయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X