twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేమంటే ఎందుకంత చులకన, మీ వల్ల మా అమ్మ హెల్త్ పాడైంది : అనసూయ

    By Bojja Kumar
    |

    యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని వీడియో తీసి తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నటి, యాంకర్ అనసూయ ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలా రూల్స్ అతిక్రమించే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం లేదు అనే మీనింగ్ వచ్చేలా అనసూయ తన ఇంటెన్షన్ వ్యక్తం చేశారు. అయితే కొందరు తప్పు చేసిన ఆ డ్రైవర్‌ను వెనకేసుకొస్తూ.... అనసూయ మీద విరుచుకుపడటంతో ఆమె ఘాటుగా స్పందించారు.

    వ్యక్తి చేసిన కామెంటుపై అనసూయ ఘాటుగా...

    వ్యక్తి చేసిన కామెంటుపై అనసూయ ఘాటుగా...

    ‘అనసూయగారు కంప్లయింట్ చేశారు, మంచి పనే అనుకుందాం. కానీ ఒక్క నిమిషం మీ ఆడి క్యూ 7 కారు విండో దించి అతడికి చెప్పి ఉండొచ్చు. మీరు ఇప్పుడు కంప్లయింట్ చేయడం వల్ల పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే అతడికి ఆదాయం ఎలా వస్తుంది? ఎలా బ్రతుకు తాడు?' అని ఓ వ్యక్తి చేసిన కామెంటుపై అనసూయ ఘాటుగా స్పందించారు.

    మాపై ఎంతుకంత చులకన భావం?

    మాపై ఎంతుకంత చులకన భావం?

    మీరు మాపై ఈజీగా నోరు పారేసుకుంటారు. నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఇంగితం కూడా మీకు లేదు. నేను కూడా కష్టపడే సంపాదిస్తున్నానండి. నా ఫ్యామిలీ కోసమే మా కష్టం, మా పని. మాపై ఎంతకంత చులకన భావం?... అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.

    మీలా సాధారణ ఉద్యోగాలు కూడా చేసుకోలేము

    మీలా సాధారణ ఉద్యోగాలు కూడా చేసుకోలేము

    మా గురించి, మా సంపాదన గురించి, మా ఫ్యామిలీస్ గురించి కొన్ని యూట్యూబ్ చానల్స్‌లో ఇష్టం వచ్చినట్లు రాసేపుడు, ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసేపుడు మాత్రం మీరు ఆలోచించరు. మీ వల్ల మా ఫేమ్ పోయి పని పోతే... మీలాగా మామూలు ఉద్యోగాలు కూడా చేసుకోలేము..... అని అనసూయ తెలిపారు.

    మీ మాటల వల్ల మా అమ్మ హెల్త్ పాడైంది

    మీ మాటల వల్ల మా అమ్మ హెల్త్ పాడైంది

    ‘‘సంపాదించడానికే అతడు(క్యాడ్ డ్రైవర్) అంత కష్టపడాలి అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే చాలా బావుండేది. మనం తప్పు చేసినపుడు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసి, వేరే వాళ్లు తప్పు చేసినపుడు ట్విట్టర్లో కంప్లయింట్ చేయడం మీకు అంత మంచిది కాదండీ'' అంటూ ఓ వ్యక్తి చేసిన కామెంటుపై అనసూయ తీవ్రంగా ఫైర్ అయ్యారు. నేను తప్పు చేశానని ట్విట్టర్ క్లోజ్ చేయలేదు. మీ మాటలకి మా అమ్మ హెల్త్ పాడైతే క్లోజ్ చేశాను... అని అనసూయ తెలిపారు.

    మీలాంటి వారికి సమాధానం చెప్పడం నేర్చుకున్నాను

    మీలాంటి వారికి సమాధానం చెప్పడం నేర్చుకున్నాను

    ఇపుడు నాకు నేను. మా ఇంట్లో వాళ్లకి ధైర్యం చెప్పి... మీ లాంటి వాళ్ల గురించి వారిని ముందే హెచ్చరించి, మీ లాంటి వారికి జవాబు చెప్పడం నేర్చుకుని ఇలా ఉన్నాను అంటూ అనసూయ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

    నేను చెబితే మళ్లీ అలాంటిదే జరుగుతుంది

    నేను చెబితే మళ్లీ అలాంటిదే జరుగుతుంది

    "అనసూయ గారు నేను ఎక్కడా నా ట్వీట్స్‌లో మీ ఫ్యామిలీని. మీ వర్క్ అనలేదు. నాకు ఆ చులకన భావం కూడా లేదు. ఒకసారి మీరు చెప్పి ఉంటే అయిపోయి ఉండేది కదా ఇపుడు దాని వల్ల అతడు కష్టాలు పడవలసి వస్తుంది." అనే కామెంటుకు అనసూయ రియాక్ట్ అవుతూ... ‘‘నేను చెబితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇందాక మీరు కథ చెప్పారే నేను ఫోన్ పగలకొట్టానని. అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. నాకు ఆ టైమ్ లో అదే చేయడం కరెక్ట్ అనిపించింది.

    అలా చేస్తే వారిలో భయం ఉంటుందా?

    అలా చేస్తే వారిలో భయం ఉంటుందా?

    నేను కారు దిగి చెబితే మళ్లీ అలా చేయొద్దు అనే భయం ఉంటుందా? మనం చిన్నప్పుడు తప్పు చేస్తే మన తల్లిదండ్రులు, మన టీచర్స్ మన మంచి కోరే మనతో కఠినంగా ఎందుకు ఉన్నారు? మళ్లీ అలా ఏదైనా చేసే ముందు భయం ఉండాలి. అలా చేయడం మానుకోవాలి అనే కదా? అంటూ అనసూయ వ్యాఖ్యానించారు.

    English summary
    Tollywood actor ans Tv anchor Anasuya Bharadwaj faced trolls on social media who are filling the Twitter with counter comments to her complaint to the Hyderabad traffic police online posting a video of a man in the driver seat watching a video on his phone as he drives in high traffic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X