వేటూరి పాట.. అనసూయ గ్లామర్ ట్రీట్.. రియల్లీ జబర్దస్త్ బ్యూటీ
Recommended Video
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వేటూరి గారి పాటను ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బుల్లితెర, వెండితెర పైనే కాకుండా సోషల్ మీడియాలో అనసూయ హంగామా నడుస్తోంది. భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటూ ముందుకెత్తున్న ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబందించిన విశేషాలను ఆన్‌లైన్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.

ఎల్లో కలర్ సారీ.. అనసూయ సొగసు
ఏ మాత్రం అందాల ప్రదర్శనకు పోకుండా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అనసూయ. ఎల్లో కలర్ సారీ కట్టుకొని వెన్నెల వెలుతురులో ఆమె ఇచ్చిన ఫొటో పోజులు నెటిజన్లను మాయ చేస్తున్నాయి. పైగా ఈ ఫొటో షూట్‌కి అనసూయ చేసిన ట్యాగ్ మరింత అందం తెచ్చింది.
మసకే పడితే మరకత వర్ణం.. అనసూయ ట్రీట్
''మసకే పడితే మరకత వర్ణం..అందం చందం అలిగిన వర్ణం'' అని వేటూరి పాటను ట్యాగ్ చేస్తూ తన అందాన్ని తెగ పొగిడేసుకుంది అనసూయ. ఎల్లో కలర్ సారీ.. లుక్స్ తోనే పడేస్తూ అనసూయ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ ఈ ఫొటో షూట్ పై లైకుల వర్షం కురిపిస్తోంది. బ్యూటిఫుల్ మేడం, రియల్లీ జబర్దస్త్ బ్యూటీ అంటూ తెగ పొగిడేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

జోరుగా సాగిపోతున్న అనసూయ ప్రయాణం
వెండితెరపై జోరుగా సాగిపోతున్న అనసూయ ప్రయాణం లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం' వరకు వచ్చింది. ఆగస్టు 9 వ తేదీన అనసూయ 'కథనం' విడుదల కానుంది. ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనుంది అనసూయ. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన 'కథనం' మూవీ అనసూయ వెండితెర ప్రయాణాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అంటున్నారు దర్శకనిర్మాతలు.

నాగార్జునతో క్లాష్
నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 కూడా ఆగస్టు 9 వ తేదీనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున, అనసూయ మధ్య క్లాష్ ఏర్పడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ చూడబోతున్నామని చెప్పుకున్నారు. కానీ ఈ ఇష్యు పై ఇటీవలే స్పంచించిన అనసూయ.. నాగార్జున లాంటి పెద్ద హీరోతో తనకు పోటీ ఏంటని ఖండించింది. అంతేకాదు మన్మథుడు 2 ట్రైలర్ బాగుందని పొగడ్తల వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











