అనసూయకు బంపర్ ఆఫర్.. ఏకంగా చిరంజీవితో.. మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారిందిగా!

బుల్లితెర యాంకర్‌గా అందరికీ సుపరిచమే యాంకర్ అనసూయ. తన ఒంపు సొంపులతో బుల్లితెరకు కొత్త శోభ తీసుకొచ్చిన ఈ సుందరి.. వెండితెరపై కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తన అందం, అభినయం రెండింటితో ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర అన్నట్లుగా సాగుతున్న ఆమె ప్రస్థానం మెల్లగా మెగా హీరోల కంట పడింది. దీంతో మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారింది అనసూయ. తాజా సమాచారం మేరకు అమ్మడికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట.

రామ్ చరణ్‌తో రంగస్థలం.. వరుణ్ తేజ్‌తో ఎఫ్ 2

రామ్ చరణ్‌తో రంగస్థలం.. వరుణ్ తేజ్‌తో ఎఫ్ 2

చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ కనబర్చిన నటన చిత్రానికే తలమానికం అయింది. తన వెండితెర ప్రస్థానంలో ఈ పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే మరో మెగా యువ హీరో వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సినిమాలో కూడా అనసూయ నటన భేష్ అనిపించుకుంది.

ఇన్నాళ్లు నాగబాబుతో.. ఇక చిరుతో

ఇన్నాళ్లు నాగబాబుతో.. ఇక చిరుతో

ఇక మెగా బ్రదర్స్ విషయానికొస్తే.. ఇన్నాళ్లు బుల్లితెరపై నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోలో యమ హంగామా చేసిన ఈ అమ్మడు ఇక మెగాస్టార్ చిరంజీవితో చిందులేసేందుకు సిద్ధమవుతోంది. చిరు- కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో అనసూయకు కీలక పాత్ర దక్కిందని సమాచారం.

అనసూయ కోసమే ప్రత్యేకంగా

అనసూయ కోసమే ప్రత్యేకంగా

ఇటీవలే 'భరత్ అనే నేను' సినిమాతో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ చిరుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మేరకు రంగస్థలంలో రంగమ్మత్తను మించి ఉండేలా అనసూయ కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ డిజైన్ చేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమాను మలుపుతిప్పేలా ఈమె క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు.

మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా

మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా

ఇదేగాక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రానున్న కొత్త చిత్రంలో కూడా అన‌సూయ కీల‌క పాత్ర‌ పోషించనుంది తెలుస్తోంది. రంగ‌స్థ‌లంతో అన‌సూయ‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ ఆమె కోసం మ‌రోసారి అలాంటి పాత్ర‌నే సిద్ధం చేశాడని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూస్తే అనసూయ మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారిందని చెప్పక తప్పుతుందా? మీరే చెప్పండి. ఎంతైనా అనసూయ లక్కే లక్కు.

చిరంజీవి పుట్టిన రోజునే

చిరంజీవి పుట్టిన రోజునే

ఇక కొరటాల శివ- చిరంజీవి కొత్త ప్రాజెక్టును చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన ప్రారంభించి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారట. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న చిరు.. ఈ సినిమా పూర్తి కాగానే ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొరటాల సెట్స్‌పైకి వెళ్లనున్నారు. నిరుద్యోగం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X