శభాష్ అనసూయ.. కేరళ బాధితుల కోసం ఏం చేశారంటే..
Recommended Video

కేరళ రాష్ట్రం వరద బీభత్సంతో తల్లడిల్లతున్నది. గత వారం రోజులు లక్షల మంది తిండి, నిద్రకు దూరమై కష్టాలతో సతమతమవుతున్నారు. కేరళ వాసుల బాధలకు గుండె పగిలిన ప్రముఖులు వారిని ఆదుకొనేందుకు తమ వంతు సాయంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆర్థికంగానూ, ఇతరత్రా సహాయక చర్యల ద్వారా స్పందించారు. తాజాగా యాంకర్, నటి అనసూయ తన వంతు సాయంగా కేరళ బాధితులకు సహాయం అందించారు. అనసూయ ఏం చేశారంటే..

కేరళ బాధితులకు చద్దర్లు
కష్టాల్లో ఉన్న కేరళవాసులను ఆదుకొనేందుకు అనసూయ చొరవ చూపారు. పోచంపల్లి ఇకత్ చేనేత చద్దర్లను కొనుగోలు చేశారు. వాటిని కేరళలోని నిరాశ్రయులకు పంపించారు. కేరళవాసుల ఇబ్బందులను తన కష్టంగా భావించిన అనసూయకు నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
అనసూయకు ధన్యవాదాలు
కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకొనేందుకు ఆమె చూపిన చొరవకు ధన్యవాదాలు అని పోచంపల్లికి చెందిన ఓ చేనేత ట్వీట్ చేశారు. దానిని అనసూయ రీట్వీట్ చేశారు. అనసూయ చేసిన సహాయానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హాండ్లూమ్ నాకు ఫేవరేట్
గతంలో తనకు చేనేత అంటే ఎంతో ఇష్టమని అనసూయ ట్వీట్ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం, ప్రొఫెషనల్ అవసరాల కోసం నాకు హ్యాండ్లూమ్ వస్త్రాలంటే ఫేవరేట్ అని పేర్కొన్నారు. చేనేత కుటుంబాల బిడ్డను.. వారికి అండగా ఉన్నానని నేను ప్రత్యేకంగా చెప్పుకొనే అవసరం లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌లో అనసూయ
కెరీర్‌పరంగా ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనసూయ సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆమె నటించిన సచ్చిందిరా గొర్రె అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించింది.


Click it and Unblock the Notifications











