మిరపకాయతో మత్తెక్కించిన హాట్ హాట్ అనసూయ.. చెప్పకనే చెబుతోందా..?
బుల్లితెర బ్యూటీగా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత వెండితెరపై కూడా కాలు మోపి టాలెంట్ రుజువు చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను కనువిందు చేసే అనసూయ ఈ సారి సెగలు పుట్టించే డ్రెస్‌లో ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది. అయితే అనసూయ అందాలు కామనే అయినా ఈ పిక్స్ పంచుకుంటూ ఆమె పెట్టిన ఎమోజీ ఆసక్తికరంగా మారింది.

తనలోని హాట్ నెస్‌కి సింబల్‌గా
మిర్చి లాంటి ఎరుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ కవ్వించిన అనసూయ.. మిరపకాయ ఎమోజీని పోస్ట్ చేయడం నెటిజన్లను బాగా ఆకర్షించింది. వయసు పెరుగుతున్నా కొద్ది రోజు రోజుకూ తనలోని హాట్‌నెస్‌కి పదును పెడుతున్న ఈ జబర్దస్త్ బ్యూటీ తన లోని హాట్ నెస్‌కి సింబల్‌గా ఈ ఎర్రటి మిరపకాయ ఎమోజీ పోస్ట్ చేసింది.

ఫిదా అయిన నెటిజన్స్.. ఓ రేంజ్ కామెంట్స్
అనసూయ హాట్ అందాలు, ఆమె పోస్ట్ చేసిన ఘాటు మిరపకాయ చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. మిర్చి కంటే ఘాటైన అందాలు నీ సొంతం అనసూయ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రంగమ్మత్త యూఆర్ సో బ్యూటిఫుల్, సూపర్ అంటూ అనసూయ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రోల్స్ కూడా తప్పడం లేదు
సాధారణంగా హాట్ లుక్స్ అంటే కొన్ని సందర్భాల్లో ట్రోల్స్ తప్పవు. తాజాగా అనసూయ విషయంలోనూ అదే జరుగుతోంది. మిరపకాయా? అబ్బా ఛా.. నీకు అంత ఉందా? అని పేర్కొంటూ ముసలమ్మలా ఉన్నావ్ నువ్.. పోయి ఏదైనా సమాజ సేవ చేసి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టండి. దేవతలా ఆరాధిస్తారు కానీ ఈ ఫోటోలందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జోరుగా సాగిపోతున్న అనసూయ ప్రయాణం
వెండితెరపై జోరుగా సాగిపోతున్న అనసూయ ప్రయాణం లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం' వరకు వచ్చింది. ఆగస్టు 9 వ తేదీన అనసూయ 'కథనం' విడుదల కానుంది. ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనుంది అనసూయ. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన 'కథనం' మూవీ అనసూయ వెండితెర ప్రయాణాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అంటున్నారు దర్శకనిర్మాతలు.

అనసూయ 'కథనం' మూవీ
రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందిన 'కథనం' చిత్రానికి బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా నిర్మాతలుగా వ్యవహరించారు. ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలు సంయుక్తంగా సమర్పించాయి. చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం అందించగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేశారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనసూయ లీడ్ రోల్ పోస్తిస్తుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది.


Click it and Unblock the Notifications











