జిమ్‌లో చిందులు.. బుల్లి నిక్కర్‌లో అనసూయ.. అద్దం ముందు అలా!
అనసూయ సోషల్ మీడియాలో చేసే అల్లరి ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో నెగెటివిటీ ఉంటుందో తెలిసిందే. అయితే ఆ నెగెటివ్ కామెంట్లకు అనసూయ అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తుంటుంది. అలా అనసూయ చూపే తెగువ, ధైర్యానికి అందరూ ఫిదా అవుతుంటారు. అనసూయ ఇప్పుడు ఇటలీలో ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

సినిమా కోసం..
అనసూయ ప్రస్తుతం మిలాన్‌లో రచ్చ చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న ఖిలాడీ సినిమా కోసం అనసూయ ఇటలీకి వెళ్లింది. గత వారం నుంచి అనసూయ అక్కడే ఉంటోంది. అయితే ఎక్కడికి వెళ్లినా సరే వర్కవుట్లు మాత్రం చేయడం తప్పదు కదా. అదే క్రమంలో అనసూయ తాజాగా తన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

ఫిట్ నెస్ మీద దృష్టి..
అనసూయ మామూలుగానే ఈ మధ్య ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టేసింది. ప్రతీ రోజూ వర్కవుట్లు చేస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా.. రాత్రంతా షూటింగ్ చేసి వచ్చినా కూడా ఉదయాన్నే వర్కవుట్లు మాత్రం చేస్తుంటుంది. ఇక వీకెండ్స్ వస్తే తన భర్తతో కలిసి మరీ వర్కవుట్లు చేస్తుంటుంది.

తాజాగా అలా..
అయితే తాజాగా అనసూయ ఇటలీలోనూ తన వర్కవుట్ సెషన్‌ను వదిలి పెట్టలేదు. అక్కడ మరింత ఎంజాయ్ చేస్తూ వర్కవుట్లు చేసింది. బుల్లి నిక్కర్లో దర్శనమిచ్చిన అనసూయ తన క్యూట్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేసింది. అద్దం ముందు నిలబడి ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

ఇక షూటింగ్ లొకేషన్స్‌లో రచ్చ..
ఇక అనసూయ షూటింగ్ లొకేషన్స్‌లో రచ్చ రచ్చ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మిలాన్ వీధుల్లో తిరుగుతూ రీల్ వీడియోలు చేస్తోంది. షాట్ గ్యాప్‌లో అనసూయ చేసిన ఈ వీడియో చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











