పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవ్..రాత్రి రెండు గంటలకు తాగేసి ఉన్నా..అనసూయ రచ్చ

అనసూయ బుల్లితెర, వెండితెరపై ఎలా దుమ్ములేపుతూ ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. బోల్డ్‌గా ఆమె చేసే కామెంట్లు, షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఇప్పటి వరకు ఆమెకు ఎదురైన ట్రోలింగ్, కాంట్రవర్సీలు అన్నీ కూడా మాట్లాడేసింది. ఈ క్రమంలో తాను తాగుతాను అనే విషయాన్ని కూడా చెప్పేసింది.

అత్తారింటికి దారేది..

అత్తారింటికి దారేది..

పెద్ద హీరోల పక్కన చాన్స్ వచ్చినా కూడా వద్దంటున్నారట అని యాంకర్ అడిగింది. అలా అత్తారింటికి దారేది సినిమా విషయంపై మళ్లీ మాట్లాడింది. ఇట్స్ టైం టు పార్టీ అనే పాటలో అడిగారు.. నేను ఒక్కదాన్ని అయితేనే చేస్తాను అనిచెప్పాను. నువ్ పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవ్ అని అన్నారంటూ నాటి విషయాలను అనసూయ గుర్తుకు చేసుకుంది.

ట్రోలింగ్ గురించి..

ట్రోలింగ్ గురించి..

నా బాడిని నాకు గర్వంగా ఉంది. నా పొట్ట అంత ఉంది కాబట్టే.. నా పిల్లలు అంత బాగా పుట్టారు.. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవ్వను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. నా డ్రెస్సింగ్ మీద కూడా కామెంట్ చేస్తుంటారు.. ఇవన్నీ అవసరమా? ఆంటి ఇంట్లో పిల్లలను చూసుకోవచ్చు కదా? అని అంటారు.. వాళ్లే మా పిల్లలను పోషించినట్టు ఫీలవుతుంటారు అని అనసూయ చెప్పుకొచ్చింది.

షారుఖ్ ఖాన్‌ను ఎందుకు అనరు..

షారుఖ్ ఖాన్‌ను ఎందుకు అనరు..

మేం ఐటమ్స్ కాదు.. స్పెషల్ సాంగ్ చేస్తే ఐటం అని ఎలా అంటారు.. అదో ఓ హీరో స్పెషల్ సాంగ్ చేస్తే ఐటం బాయ్ అని ఎందుకు అనరు.. దర్ ది డిస్కో అని షారుఖ్ ఖాన్ అన్నప్పుడు ఆయన్ని ఐటం బాయ్ అని ఎందుకు అనలేదంటూ అనసూయ ప్రశ్నించింది.

తాగుతాను..

తాగుతాను..

నన్ను డిజైరబుల్ లిస్ట్‌లో పెట్టారు.. నన్ను అవమానించారు.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డును రిటర్న్ ఇచ్చేశాను అని అనసూయ వాపోయింది. ఓ సారి రాత్రి రెండు గంటల సమయంలో అప్పుడు నేను తాగి ఉన్నాను.. అని అనసూయ చెప్పింది. నువ్ తాగుతావా? అని అనసూయను యాంకర్ అడిగితే.. హా అవును అన్నట్టుగా చెప్పేసింది.

ఇది కేవలం ప్రోమో..

ఇది కేవలం ప్రోమో..

ఈ మేరకు వదిలిన ప్రోమో బాగా వైరల్ అయింది. ఇది మళ్లీ కాంట్రవర్సీకి దారి తీస్తుండటం అనసూయ క్లారిటీ ఇచ్చింది. అది కేవలం ప్రోమోనే పూర్తి ఇంటర్వ్యూ చూడండి అన్నట్టుగా సూచించింది. మొత్తానికి అనసూయ మళ్లీ నాటి విషయాలను బయటకు తీసుకొచ్చేట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X