బన్నీకి అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్.. వెంటనే కవరింగ్.. వీళ్ళందరూ ఏమైపోతారో అంటూ రష్మికను కూడా!
ప్రముఖ టెలివిజన్ యాంకర్ అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయిని అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా, ఆ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే అల్లు అర్జున్ విషయంలో ఒకసారి డబుల్ మీనింగ్ డైలాగ్ వాడిన అనసూయ వెంటనే విషయం అర్థం చేసుకుని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే

డిసెంబర్ 17వ తేదీన
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో మొత్తం శెట్టి మీడియా సహా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

ఆసక్తికర విషయాలు
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. హైదరాబాదులో ఉన్న యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ తన పాత్ర గురించి ఆ పాత్ర తనకు ఎలా దక్కింది అనే సంగతి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఒక కల లాగా
తనకు నిజంగా ఇది ఒక కల లాగా ఉంది అని ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ఇంత మంది జనాన్ని చూడటం ఇదే మొదటిసారి అని ఒక రకంగా ఈ ఎక్స్పీరియన్స్ ని బాగా మిస్ అవుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.. ముందు తనను క్షమించాలని ఇంత పెద్ద క్రౌడ్ ముందు మాట్లాడి చాలా రోజులు అయింది అని, అనసూయ చెప్పుకొచ్చింది.

డబుల్ మీనింగ్ డైలాగ్ వేసి
ముందుగా హృదయపూర్వకంగా అల్లు అర్జున్ కి ధన్యవాదాలు చెబుతున్నాను అని అనసూయ చెప్పుకొచ్చింది.. మామూలుగా అమ్మా నాన్నలను దేవుళ్లను కోరికలు కోరుతూ ఉంటాము కానీ నేను ఇలాగే ఒకరోజు స్టేజ్ మీదకు వచ్చి, మీతో నటించాలి అని అడిగాను టక్ మని వారం రోజుల్లో ఫోన్ వచ్చేసింది నాకు, ఇదే కంటిన్యూ అవుతుంది అంటే నేను చాలా అడగాలి, అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసింది. దానికి అల్లు అర్జున్ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. దీంతో మళ్లీ వెంటనే కవర్ చేస్తూ సినిమాలో ఛాన్స్ లు అంటూ అనసూయ కూడా నవ్వేసింది.
Recommended Video

వీళ్ళందరూ ఏమైపోతారో అంటూ
అలాగే అల్లు అర్జున్ సినిమా లోకి తనను తీసుకున్నందుకు థాంక్స్ అని ఆమె చెప్పుకొచ్చింది.. సుకుమార్ సార్ కి కూడా చాలా రుణపడి ఉంటాను అని ఎందుకంటే నేను అవకాశం అడిగిన రోజు ఇద్దరు సైగలు చేసుకున్నారని అయితే తనకు సినిమాల్లో అవకాశం వస్తుందని ఊహించలేదు అని చెప్పుకొచ్చింది. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ, సామీ సామీ ఇప్పటి వరకు వచ్చింది ఒకటి ఇప్పుడు వేరే, నాకే ఏదోలా ఉందంటే వీళ్ళందరూ ఏమైపోతారో అంటూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక టీవీలో అందం చూస్తున్నారు కదా సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ ఏంటో సినిమాల్లో చూపిస్తాం అంటూ ఆమె కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











