»   » లవ్లీ యాంకర్ అనసూయ నాగార్జునతో జాయినైంది (ఫోటో)

లవ్లీ యాంకర్ అనసూయ నాగార్జునతో జాయినైంది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాంకర్ అనసూయ షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.

సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. లవ్లీ అనసూయ కూడా ఓ ఎంటర్టెనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు.

బుల్లితెరపై తన సెక్సీ సెక్సీ అందాలతో అతరిస్తున్న అనసూయ ఈ సినిమాలో చాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ముందుగా స్వాతికి రాగా.. ఆమె దాన్ని తిరస్కరించేసింది. దాంతో ఆ అవకాశం ఈ అమ్మడికి లభించినట్లు తెలుస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం.

 Anasuya Bharadwaj joins in Soggade Chinni Nayana

సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నాగ్ రెండు పాత్రలు చేయనున్నారు. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. యాంకర్ అనసూయ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితం. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంటుందని అంటున్నారు.

English summary
"Non-stop shoot till finish started for Soggade Chinni Nayana / lovely Anasuya Bharadwaj joins in for an entertaining scene." Akkineni Nagarjuna said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu