Just In
- 1 hr ago
క్రాక్ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కానీ ఇప్పుడు జేబుల్ ఫుల్.. అంతకుమించి!
- 2 hrs ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!
- 2 hrs ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 3 hrs ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
Don't Miss!
- Sports
India vs Australia: గాయంతో సైనీ ఔట్.. బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ వీడియో
- News
ఎలా ఓడిపోయాడో తెలియదంట ... పూర్తిగా మారిపోయానని కొత్త డ్రామాలు : చంద్రబాబుపై సాయి రెడ్డి వ్యంగ్యం
- Finance
ఫిబ్రవరి 1న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
- Lifestyle
Army Day 2021 : ‘సరిలేరు మీకెవ్వరు’ ఇవి తెలిస్తే.. సైనికులకు సలాం కొట్టకుండా ఉండలేరు...!
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్లీ వివాదంలో అనసూయ వస్త్రాదారణ.. ‘జబర్దస్త్’ కామెంట్లతో నెటిజన్ల ట్రోలింగ్
వివాదాల వెనుక అనసూయ నడుస్తుందో.. అనసూయ వెనక వివాదాలు నడుస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఈ రెంటికి ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. అనసూయ, సోషల్ మీడియా ట్రోలింగ్ అనేవి నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో మంట పెడుతున్నాయి. అయితే ఇందులో అనసూయ వస్త్రాధారణపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

నిత్యం వార్తల్లోనే..
అనసూయ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అలా ఉండాలిన కూడా అనసూయ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్లతో సందడి చేస్తుంది. జబర్దస్త్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, స్టిల్స్‌ను ప్రతీ రోజూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలా షేర్ చేసిన ఫోటోలో వివాదానికి కారణమయ్యాయి.

ఫోటోలు వైరల్..
అనసూయపై రకరకాలుగా ట్రోల్స్ నడుస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఆమె వస్త్రాధారణను అందరూ వేలెత్తి చూపుతుంటారు. అయితే కొందరు ఆమెను సమర్దించేవాళ్లు కూడా ఉంటారు. కానీ మెజార్టీ మాత్రం ఆమెను ఏకిపారేస్తుంటారు. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలను సైతం అలాగే కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ప్యాంట్ వేసుకోలేదంటూ..
అనసూయ తాజాగా ఓ చిత్రమైన డ్రెస్‌ను ధరించింది. అందులో అనసూయ ప్యాంట్ వేసుకోలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి డ్రెస్సులు కాకుండా మంచివి వేసుకోవచ్చు కదా?.. అది జబర్దస్త్ షోనా లేదా మరేదైనా షోనా? అలాంటి వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నావ్.. డబ్బుల్లేవా? మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు కదా? అని ఇలా పలురకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మొత్తానికి అనసూయ డ్రెస్, ఫోటోలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి.

వెరైటీ షాక్..
తాజాగా అనసూయ అందరికీ ఓ షాక్ ఇచ్చింది. సిల్క్ స్మిత రిఫరెన్స్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. దీంతో అనసూయ సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తోందని ప్రచారంలోకి వెళ్లింది. తీరా ఈ వార్తలు అన్ని మీడియా సంస్థల్లో ప్రధానంగా వచ్చిన తరువాత.. తాపీగా వాటిని ఖండించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని చెప్పి షాక్ ఇచ్చింది.