ఓటీటీలో విడుదలకు సిద్దమైన యాంకర్ అనసూయ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కొత్త సినిమా డైరెక్ట్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. యాంకర్ అనసూయ ప్రస్తుతం నటిగా కూడా మంచి మంచి పాత్రల్లో జనాలను మేప్పిస్తోంది. రెగ్యులర్ గ్లామరస్ రోల్స్ కాకుండా డిఫరెంట్ కంటెంట్ కథలను ఎంచుకుంటోంది.
ఇక ఇటీవల ఆమె ఎంతో ఇష్టపడి చేసిన ఎమోషనల్ మూవీ 'థ్యాంక్ యు బ్రదర్'. మంచి సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ వలన సినిమా థియేటర్లు మూత పడడంతో ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆహా యాప్ నుంచి మంచి ఆఫర్ రావడంతో డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 7 నుంచి సినిమా ఆహా యాప్ లో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక అనసూయ ప్రస్తుతం మరికొన్ని విభిన్నమైన సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా అనసూయ భయంకరమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సునీల్ భార్యగా ఒక డేంజరస్ మహిళగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లోనే అనసూయ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











