బోల్డ్ క్యారెక్టర్‌తో దుమ్ములేపనున్న అనసూయ.. సిల్క్ స్మితగా అదిరిపోయే లుక్
అనసూయను ఓ యాంకర్, స్కిన్ షో చేసే గ్లామర్ డాల్‌గా మాత్రమే చూసిన సమయంలో క్షణం సినిమాతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్షణం సినిమా తరువాత అనసూయలోని నటిని అందరూ ప్రశంసించారు. ఆ తరువాత రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అసాధారణమైన నటనను కనబర్చింది. ఆ పాత్రతో అనసూయ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంది. అనసూయ ఏదైనా పాత్ర ఒప్పుకుంటే అందులో ప్రత్యేకత ఉంటుందనే ఆలోచన కలిగేలా చేసింది.

అది వర్కవుట్ కాలేదు..
అయితే అనసూయ గతేడాది మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో ఓ పాత్రను చేసింది. దానికి కూడా మంచి పేరు వస్తుందని అందరూ భావించారు. కానీ అది నిరుత్సాహ పరిచింది. సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.. అనసూయకూ అంత పేరు రాలేదు.

వరుసగా చిత్రాలు..
అనసూయ ఇప్పుడు మాత్రం వరుసగా చిత్రాలను ఓకే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ రంగమార్తాండ చిత్రంలో అదిరిపోయే పాత్రను చేస్తోన్నట్టు సమాచారం. ఈ మధ్య రవితేజ ఖిలాడీ సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్‌కు ఓకే చెప్పిందని టాక్. థ్యాంక్యూ బ్రదర్ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా అనసూయ నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మరో బాంబ్ పేల్చింది.

సిల్క్ స్మిత బయోపిక్..
ఇండియన్ స్క్రీన్ మీద మరీ ముఖ్యంగా సౌత్ సినిమాల్లో సిల్క్ స్మిత లాంటి నటి మళ్లీ రాదు. ఆమెలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కళ్లతోనే భావాలు పలికించే మరో నటి రావడం చాలా కష్టం. ఆమె జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నాయో అందరికీ తెలిసింది. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా డర్టీ పిక్చర్ అనే ఓ సినిమా వచ్చింది. అది కాసుల వర్షాన్ని కురిపించింది. తాజాగా మరోసారి సిల్క్ స్మిత బయోపిక్ తెరపైకి రానుంది.

సిల్క్ స్మితగా అనసూయ..
సిల్క్ స్మిత పాత్రలో అనసూయ నటించబోతోన్నట్టు తెలుస్తోంది. లుక్ టెస్ట్ కోసం అనసూయ ఇప్పుడు చెన్నైలో సందడి చేస్తోంది. అనసూయ స్టైలీష్ట్ గౌరీ ఆధ్వర్యంలో అనసూయ సిల్క్ స్మితగా మారేందుకు మేకప్ వేసుకుంది. తాజాగా అనసూయ ఓ ఫోటోను షేర్ చేసింది. ఫోటోతోనే అనసూయ ఇలా సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. సినిమాలో ఇంకెంత విజృంభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











