ఎప్పటికీ అనసూయే హాట్ అంటోన్న నాగబాబు.. మెగా బ్రదర్‌పై రంగమ్మత్త రియాక్షన్ ఇదే
మెగా బ్రదర్ నాగబాబు చేసే కామెంట్లు ఒక్కోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. గురి చూసి మరీ నాగబాబు కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తుంటారు. గతేడాది లాక్డౌన్ కాలంలో నాగబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నాగబాబు కామెంట్లతో కొన్ని సందర్భాల్లో జనసేన కూడా ఇరుకున పడింది. ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇస్తూ వివరణ ఇచ్చుకోవాల్సింది. అలా నాగబాబు చేసే కామెంట్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.

సోషల్ మీడియాలో హవా..
ప్రస్తుతం నాగబాబు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాడు. ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ అంటూ అన్నింట్లోనూ రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రాంలో జెట్ స్పీడులో దూసుకుపోతోన్నాడు. తన ఫాలోవర్లతో చిట్ చాట్ కూడా చేస్తున్నాడు. గత వారం నాగబాబు ఇచ్చిన పంచ్‌లు, కౌంటర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

రోజాపై కౌంటర్లు..
జబర్దస్త్‌లో ఇష్టమైన కమెడియన్ ఎవరు అని నాగబాబును నెటిజన్ అడిగితే.. రోజా అంటూ సెటైర్ వేశాడు. ఆమె జడ్జ్ కదా? కమెడియన్ అని అన్నాడేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె కూడా పంచ్‌లు వేస్తుంటారు కదా? అని అలా సరదాగా చెప్పానని నాగబాబు ఆ తరువాత క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా అలా..
నాగబాబు తాజాగా మరోసారి తన ఇన్ స్టా ఫాలోవర్లతో ముచ్చటించాడు. ఇందులో కూడా నాగబాబు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు నాగబాబు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆన్సర్ ఇచ్చాడు. రష్మీ అనసూయ ఇద్దరిలో ఎవరు ఇష్టం అని అడిగితే.. నాగబాబు షాకింగ్ రిప్లై ఇచ్చాడు.

ఎప్పటికీ హాట్..
అనసూయే ఎప్పటికీ హాట్ అంటూ నాగబాబు షాకింగ్ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ అటు ఇటూ తిరిగి అనసూయ కంట్లో పడింది. అనసూయను నాగబాబు హాట్ అన్నాడంటూ నెట్టింట్లో వైరల్ అయింది. నాగబాబు కామెంట్లపై అనసూయ స్పందించింది.

రియాక్షన్ ఇదే..
నాగబాబు హాట్ కామెంట్లపై రంగమ్మత్త స్పందించింది. నాగబాబు గారు మీరెంతో స్వీట్ అండి.. అలా చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ అనసూయ రియాక్ట్ అయింది. అలా అనసూయ ఇచ్చిన రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. నాగబాబు హాట్ కామెంట్లను అనసూయ ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











