నా మీద ఆర్జీవీ కన్ను పడిందన్నారు.. వెంటనే మా ఆయన!.. అనసూయ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Anchor Anasuya Reacts On RGV Issue || Filmibeat Telugu

సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తుండటం ఈ లోకాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుందో కొందరికి అంతే ఇబ్బందులు కలిగిస్తోంది. సోషల్ మీడియా ట్రోలింగ్స్, గాసిప్స్, పుకార్లు, ఒకరితో ఒకరికి లింకులు అంటూ నెట్టింట ఓ రేంజ్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటులకు ఈ రకమైన ఇబ్బందులు అనేకం. ఇక బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ గురించిన ట్రోల్స్, పుట్టుకొస్తున్న గాసిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది అనసూయ. వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియాలో అనసూయపై ట్రోల్స్

సోషల్ మీడియాలో అనసూయపై ట్రోల్స్

పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అనసూయ మోడ్రెన్ డ్రెస్సులు వేసుకోవడంపైనే ఆసక్తి చూపుతూ ఉంటుంది. పైగా ఈ అమ్మడు బుల్లితెర, వెండితెర ఆడియన్స్ అందరికీ బాగా సుపరిచితం కావడంతో నెట్టింట ఈమె ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెను అభినందించేవారు కొందరైతే.. ట్రోల్స్ రూపంలో కామెంట్లు పెట్టేవారు ఇంకొందరు. తాజాగా ఈ ఇష్యూ పైనే స్పందించింది ఈ హాట్ యాంకర్.

నా కేసులో ఉల్టా..

నా కేసులో ఉల్టా..

బయట ఎంత పాపులారిటీ వచ్చినా ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు ఉండటం గొప్ప అంటారు కదా. ఈ ప్రాబ్లెమ్ మీకేమైనా ఉందా? అని అనసూయను ప్రశ్నించగా.. దానిపై స్పందిస్తూ ఇలాంటిది నా కేసులో ఉల్టా అని ఒక్కమాటలో చెప్పేసింది. ట్రోల్స్ చూసి కొన్ని సందర్భాల్లో నా కాన్ఫిడెన్స్ లోపించినా కూడా నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేసేదని చెప్పుకొచ్చింది.

నేనూ మనిషినే. ఎన్నో సందర్బాల్లో ఏడిచా

నేనూ మనిషినే. ఎన్నో సందర్బాల్లో ఏడిచా

పర్సనల్‌గా మిమ్మల్ని టార్గెట్ చేసి కామెంట్స్, గాసిప్స్ వచ్చినపుడు మీరు ఏడుస్తారా? ఆ టైమ్ లో మీ ఫీలింగ్స్ ఏంటి? అనే ప్రశ్నపై.. ఎందుకేడవనండీ! నేనూ మనిషినే. ఎన్నో సందర్బాల్లో ఏడిచాను కూడా. నా జీవితంలో ఇలాంటివి చాలానే జరిగాయని ఆమె చెప్పింది.

రామ్ గోపాల్ వర్మ అంటే చాలా గౌరవం

రామ్ గోపాల్ వర్మ అంటే చాలా గౌరవం

తనకు సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే చాలా గౌరవమని చెప్పింది అనసూయ. ఆయన తీసిన ఎన్నో సినిమాలు తనకు చాలా ఇష్టమని.. కానీ ఆయన చాలామందికి అర్థం కాలేదని చెప్పుకొచ్చింది అనసూయ. అలాంటి ఆయనతో నాకు లింక్ పెట్టేసి కొన్ని వార్తలు రావడం తనను చాలా బాధపెట్టాయని తెలిపింది.

నా కెరీర్ మొదట్లోనే.. వెంటనే మా ఆయన

నా కెరీర్ మొదట్లోనే.. వెంటనే మా ఆయన

నా కెరీర్ మొదలైన తొలి రోజుల్లోనే.. నాపై ఆర్జీవీ కన్ను పడిందని వార్తలు రావడం చూసి షాక్ అయ్యాను. అప్పటికే నాకు పెళ్లయింది.. ప్రెగ్నెంట్ కూడా. అలాంటి సమయంలో నేను చాలా ఫీల్ అయ్యా. ఆ సమయంలో నా భర్త నన్ను సపోర్ట్ చేస్తూ అవన్నీ రూమర్స్.. అలా ఫీల్ కాకూడదని వెన్నుతట్టారని చెప్పుకొచ్చింది. పర్సనల్ కామెంట్స్ పై అంతలా ఫీల్ కావడం అదే మొదటిసారి, చివరిసారి అని చెప్పింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X