నాగ్‌తో నాకు లింకేంటి.. పిచ్చికాకపోతే! అనసూయ రియాక్షన్ చూడండి
హాట్ భామ అనసూయ లీడ్ రోల్ పోషించిన చిత్రం 'కథనం'. ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన విడుదల కానుంది. అయితే అంతకుముందే అదే తేదీన నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. దీంతో నాగార్జున, అనసూయ మధ్య క్లాష్ ఏర్పడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ చూడబోతున్నాం అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. అయితే తాజాగా ఈ అంశంపై వెరైటీగా రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది అనసూయ. ఇంతకీ అనసూయ తన ట్వీట్‌లో ఏమని పేర్కొంది? వివరాలు చూద్దామా..

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున..
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మన్మథుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9 వ తేదీని ఈ సినిమా విడుడల తేదీగా లాక్ చేశారు.

వాయిదా పడుతూ అనసూయ కథనం
ఈ లోగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తున్న అనసూయ 'కథనం' కూడా అదే తేదీన లాక్ చేయబడింది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా నిర్మాతలుగా వ్యవహరించారు. ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలు సంయుక్తంగా సమర్పించాయి. రోషన్ సాలూరి సంగీతం అందించారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పోటీ అంటూ కథనాలు.. అనసూయ స్పందన
మన్మథుడు 2, కథనం రెండు సినిమాలు ఒకే తేదీ విడుదల కావడం చూసి.. ఇంకేముంది ఇద్దరి మధ్య పోటీ అనిలింక్ చేస్తూ కథనాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ వార్తలు చూసిన అనసూయ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ మేరకే ఈ రోజే విడుదలైన మన్మథుడు 2 థియాట్రికల్ ట్రైలర్ పై ప్రశంసలు గుప్పించింది.
నాగ్‌తో నాకు పోటీ ఏంటి..? పిచ్చి కాకపోతే!
''నేను నాగార్జున సర్‌తో పోటీ పడటమేంటి? పిచ్చికాకపోతే. మన్మథుడు 2 ట్రైలర్ చాలా బాగుంది. నాకిష్టమైన నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నారు. నేను నటించిన 'కథనం' సినిమాతో పాటు అదే రోజున 'మన్మథుడు 2' కూడా చూస్తాను. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది అనసూయ.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రియాక్షన్
మన్మథుడు 2 ను పొగుడుతూ అనసూయ చేసిన ఈ ట్వీట్ పై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయ్యాడు. 'థాంక్ యూ అనూ.. నీకూడా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా' అని కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











