వాట్ ఎ డిజాస్టర్, క్షమాపణ చెబుతున్నా... ఆసక్తి రేకెత్తిస్తున్న అనసూయ కామెంట్!

Recommended Video

Rangasthalam Movie : Anasuya Bharadwaj Thanks Rangasthalam Movie Team | Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 2018లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ 'రంగస్థలం'. ఈ సినిమా రామ్ చరణ్, సుకుమార్‌కు ఎంత గుర్తింపు తెచ్చిందో.... ఇందులో రంగమ్మత్తగా నటించిన అనసూయకు అదే స్థాయిలో పేరు తెచ్చింది. ఈ మూవీ విడుదలైన తర్వాతి నుంచి ఆమె రంగమ్మత్తగా పాపులర్ అయ్యారు.

'రంగస్థలం'లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగాను 'జీ సినిమా అవార్డ్స్ 2018' వేడుకలో అనసూయ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనసూయ అందుకున్న ఫస్ట్ అవార్డ్

అనసూయ అందుకున్న ఫస్ట్ అవార్డ్

రంగమ్మత్త పాత్రకుగాను జీ అవార్డ్స్ వారి నుంచి తొలి అవార్డ్ అందుకున్నాను. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారికి ధన్యవాదములు అంటూ తన మనసులోని ఆనందాన్ని అనసూయ అభిమానులతో పంచుకున్నారు.

వాట్ ఎ డిజాస్టర్... క్షమాపణలు చెబుతున్నాను

అవార్డు గెచిన ఆనందంలో సరిగా మాట్లాడలేక పోయాను. నా విన్నింగ్ స్పీచ్ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. నా చిట్టిబాబు, మైత్రి మూవీ మేకర్స్, రత్నవేలు సర్, డిఎస్పీ, నా భర్త, అమ్మానాన్న, సిస్టర్స్, నా బేబీస్, రంగస్థలం సినిమాకు పని చేసిన సిబ్బందికి థాంక్స్ చెప్పడం మరిచిపోయాను. మీరంతా నా క్షమాపణలను అంగీకరించాలని కోరుకుంటున్నాను.... అని అనసూయ వ్యాఖ్యానించారు.

అనసూయకు అభినందనల వెల్లువ

అనసూయకు అభినందనల వెల్లువ

కాగా... ఈ అవార్డ్ అందుకున్నందుకుగాను అనసూయకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని, మరెన్నో మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ ఆమెను విష్ చేస్తున్నారు.

అనసూయ సినిమాలు

అనసూయ సినిమాలు

అనసూయ నటించిన ఇతర సినిమాల విషయానికొస్తే వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కథనం' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X