నాకు అలాంటివి నచ్చవని చెప్పా.. నాకోసం చరణ్‌ పెద్ద రిస్క్ చేశాడు: టాప్ సీక్రెట్ లీక్ చేసిన అనసూయ

బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో ఎదిగిపోయింది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. అక్కడ సత్తా చాటిన ఈ భామ.. వెండితెరపైనా తనదైన శైలి నటనతో ప్రశంసలు దక్కించుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ యాంకర్.. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా 'రంగస్థలం' టైమ్‌లో జరిగిన ఓ టాప్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. అదే సమయంలో రామ్ చరణ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘జబర్ధస్త్’గా యాంకర్ అనసూయ కెరీర్

‘జబర్ధస్త్’గా యాంకర్ అనసూయ కెరీర్

న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ఆరంభించింది తెలుగు అందం అనసూయ భరద్వాజ్. ఆ సమయంలోనే జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తద్వారా వరుసగా షోల ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ 'జబర్ధస్త్'గా సాగుతోంది.

సినిమాల్లోనూ సత్తా... అది ప్రత్యేకంగా

సినిమాల్లోనూ సత్తా... అది ప్రత్యేకంగా


చాలా కాలం పాటు బుల్లితెరపై తన హవాను చూపించిన అనసూయ.. సినీ పరిశ్రమలోకి సైతం అడుగు పెట్టింది. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' వెండితెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ బ్యూటీ. వీటిలో రంగమ్మత్త పాత్ర ప్రత్యకమైనది.

ఇప్పుడు వరుస చిత్రాలతో దూకుడు

ఇప్పుడు వరుస చిత్రాలతో దూకుడు

అనసూయ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ', 'థ్యాంక్యూ బ్రదర్'లో నటిస్తోంది. అలాగే సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు పవన్ 'హరిహర వీరమల్లు'తో పాటు అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలలోనూ నటిస్తోందీ హాట్ భామ.

ఓటీటీలో విడుదల కాబోతున్న మూవీ

ఓటీటీలో విడుదల కాబోతున్న మూవీ


అనసూయ, అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'థ్యాంక్యూ బ్రదర్'. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో ఈ సినిమాను మే 7న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కాబోతుంది. ఇందులో అనసూయ గర్భిణి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో అంచనాలు పెరిగిపోయాయి.

టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన అనసూయ

టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన అనసూయ

'థ్యాంక్యూ బ్రదర్' విడుదల అవుతోన్న సందర్భంగా అనసూయ భరద్వాజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమా విషయాలతో పాటు అందులోని విశేషాలపై మాట్లాడింది. అదే సమయంలో 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన ఎన్నో వివరాలు చెబుతూ ఓ సీక్రెట్ రివీల్ చేసిందామె.

నాకు అలాంటివి నచ్చవని చెప్పాను

నాకు అలాంటివి నచ్చవని చెప్పాను


ఈ ఇంటర్వ్యూ జరుగుతోన్న సమయంలో అనసూయ.. రామ్ చరణ్‌కు అన్నం తినిపించే ఫొటోను చూపించి.. దాని వెనుక కథను చెప్పమన్నారు. దీంతో ఆమె మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో ఓ సీన్‌లో భాగంగా చేపల కూర తినాల్సిన అవసరం వచ్చింది. కానీ, నాకు అదంటే అస్సలు పడదు. ఈ విషయాన్ని వెంటనే సుకుమార్ గారికి, చరణ్‌కు చెప్పాను' అంటూ చెప్పుకొచ్చిందామె.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
నాకోసం చరణ్‌ పెద్ద రిస్క్ చేశాడంటూ

నాకోసం చరణ్‌ పెద్ద రిస్క్ చేశాడంటూ

దాని తర్వాత జరిగిన విషయాన్ని వివరిస్తూ.. 'నేను చేప తిననని చెప్పిన వెంటనే.. చరణ్ ఇంట్లోని చెఫ్‌ను పిలిపించాడు. నా కోసం పన్నీర్‌ను చేప ముక్కలాగ కోయించి కూర వండించాడు. అది ఎంతో రుచిగా ఉంది. అంత పెద్ద స్టార్ హీరో అయుండి నాకోసం రిస్క్ చేయడం సంతోషంగా అనిపించింది. అతడు స్వీట్ హార్ట్. మంచి పర్సన్' అంటూ మెగా పవర్ స్టార్‌ను ప్రశంసించింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X