Just In
- 13 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 19 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 39 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 44 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.. జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఆవేదన
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా వీరవిహారం చేస్తోంది. ఆన్ లైన్ వేదికల వాడకం బాగా పెరిగింది. ఈ కారణంగా ప్రపంచం చాలా స్పీడ్ అయింది. అయితే ఈ టెక్నాలజీ కొన్నిసార్లు లేనిపోని తలనొప్పులు కూడా తెస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనసూయకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందట. ఈ విషయం తెలుపుతూ అనసూయ ట్వీట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి పోతే..

గ్లామర్ పరంగా అనసూయ..
జబర్దస్త్ భామగా బుల్లితెరపై తనదైన యాంకరింగ్ చేస్తూ అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది అనసూయ. బుల్లితెరపై తన టాలెంట్ చూపిస్తూ గ్లామర్ పరం గానూ భేష్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ. అంతేకాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది అనసూయ.

ఇద్దరు పిల్లలకు తల్లి.. మోడ్రన్ బ్యూటీ అనసూయ
బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా అన్నింటా హావా సాగిస్తున్న ఈ మోడ్రన్ బ్యూటీ.. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎప్పుడూ హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. పైగా వృత్తి రిత్యా రంగుల ప్రపంచంలో ఉంది కాబట్టి అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. ఇదే ఆమెకు కాస్త చికాకు తెచ్చిపెట్టింది.

అనసూయ ఫొటోలు మార్ఫింగ్
టెక్నాలజీ లొసుగులను ఉపయోగించి అనసూయ ఫొటోను మార్ఫింగ్ చేశారట సైబర్ కేటుగాళ్లు. అంతటితో ఆగక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట. దీంతో ఆ ఫోటోలపై తాజాగా జబర్దస్త్ బ్యూటీ రియాక్ట్ అయింది.

సంప్రదాయబద్ధంగా చీరకట్టులో అనసూయ
శనివారం రోజు సంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనసూయ.. దీంతో పాటు ఓ విషయం చెప్పింది. తన ఫొటోను ఎవరో మార్ఫ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని, దాని అసలు ఫొటోనే ఈ చీరకట్టులో ఉన్న ఇమేజ్ అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్ షేర్ చేసింది.
అనసూయ రిక్వెస్ట్..
‘‘హలో! నా ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఇమేజ్‌ను ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా నా మార్ఫ్‌డ్ ఇమేజ్‌ను చూస్తే దయచేసి దాన్ని పోస్ట్ చేసిన ఫ్రొఫైల్ గురించి నాకు చెప్పండి'' అని అనసూయ చెప్పింది. చూడాలి మరి నెటిజన్లు అనసూయ రిక్వెస్ట్ ఏ మేర పట్టించుకుంటారో!.