twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గుండె బద్దలైంది.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. అనసూయ తీవ్ర ఆవేదన

    |

    బుల్లితెర యాంకర్, నటి అనసూయ తీవ్ర ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నా గుండె బద్దలైనంత పనైందని పేర్కొంటూ సందేశమిస్తూ తెగ ఫీలై పోయింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనసూయ సందేశం ఏంటి? అనసూయ ఎందుకంత ఫీల్ అవుతోంది? వివరాల్లోకి పోతే..

    సోషల్ మీడియాలో అనసూయ జబర్దస్తీ

    సోషల్ మీడియాలో అనసూయ జబర్దస్తీ

    సోషల్ మీడియాలో అనసూయ జబర్దస్తీ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా తన ఫ్రెష్ అందాలతో అలరిస్తుంటుంది. ఈ హాట్ నెస్‌తో పాటు సామాజిక కోణంలోనూ అనసూయ పెట్టే సందేశాలు వైరల్ అవుతుంటాయి. తన వంతు బాధ్యతగా సామాజిక అంశాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ తన అభిమానుల్లో సామాజిక దృక్పధాన్ని పెంపొందిస్తుంది.

    మానవాళి మనుగడలో గొప్పవి అవే..

    మానవాళి మనుగడలో గొప్పవి అవే..

    ఈ ప్రపంచంలో మనుష్యులందరికీ ప్రాణవాయువును అందించేవి అడవులు మాత్రమే. జీవవైవిధ్యాన్ని కాపాడుతూ మానవాళి మనుగడలో అడవులు గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాంటి అడవులు అగ్నికి ఆహుతైపోతుంటే.. అడవుల్లోని ప్రాణులను కార్చిచ్చు మింగేస్తే ఆ బాధ మన గుండెల్ని దహించేస్తుంది. ప్రస్తుతం అనసూయ ఇలాంటి బాధనే వ్యక్తపరుస్తూ ఆవేదన చెందింది.

    ప్రమాదంలో అమేజాన్ రెయిన్ పారెస్ట్..

    ప్రమాదంలో అమేజాన్ రెయిన్ పారెస్ట్..

    ఈ ప్రపంచానికి ఊరిపి‌తిత్తుల్లాంటి ప్రదేశం అమేజాన్ రెయిన్ పారెస్ట్. ఈ విశ్వం మొత్తంలో ఉండే ఆక్సీజన్లో 20 శాతం ఆక్సిజన్ అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి ప్రాంతం నాశనం అయితే ప్రపంచ మానవాళికే ముప్పు. ‘లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్'గా పిలిచే అమేజాన్ రెయిన్ పారెస్ట్ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. కారణం ఏమిటో తెలియదు కానీ అడవిలో మంటలు చెలరేగి ప్రాణవాయువు అందించే లక్షలాది చెట్లు కాలి బూడిదవుతున్నాయి. దీనిపై ప్రపంచమంతా ఆవేదన చెందుతోంది.

    అనసూయ సందేశం

    ఈ నేపథ్యంలోనే అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ''అమేజాన్ రెయిన్ పారెస్ట్ కాలి బూడిద కావడం అనే వార్త విని నా గుండె బద్దలైంది. మనిషి అని పిలువబడే రాక్షసుడు దురాశతో ఎంతవరకు వెళ్తాడు. ఇంకా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేదే లేదు. ఇలాంటి దుస్థితి వచ్చినందుకు మూగదైన ఈ అభయారణ్యానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా స్పందించి తగుచర్యలు తీసుకోకపోతే ఆ తరవాత విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ మిగలదు'' అంటూ అనసూయ ఆవేదన చెందింది.

    గత పదిహేను రోజులకు పైగా

    గత పదిహేను రోజులకు పైగా

    'లంగ్స్ ఆఫ్ ప్లానెట్'గా పేర్కొనే అమెజాన్ ఫారెస్ట్ పదిహేను రోజులకు పైగా దగ్ధమవుతోంది. వేలాది చెట్లు మండిపోతున్నాయి. బ్రెజిల్ వద్ద అమెజాన్ అడవుల్లో అట్టుకున్న కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. లక్షలాది వన్యప్రాణులు అగ్నికి ఆహుతి కావడం జనాలను కలచి వేస్తోంది.

    English summary
    Anasuya Bharadwaj says.. My heart is bleeding with hurt and pain.. to what extent the demon called human will go with the greed.. how much more foolish will he/she get.. when will he/she understand we have to co-exist to exist..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X