వెనక్కి తగ్గేదే లేదు.. డబుల్ కిక్ గ్యారెంటీ! అనసూయ షాకింగ్ డిసీజన్

జబర్దస్త్ షో నుంచి ఎప్పుడైతే నాగబాబు తప్పుకున్నాడో అప్పటినుంచి ఓ రేంజ్ వార్తలు షికారు చేస్తుండటం చూస్తున్నాం. నాగబాబు బాటలోనే ఇంకొందరు జబర్దస్త్ కమెడియన్స్, అలాగే యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేయనున్నారని టాక్ నడించింది. ఈ లోగా అనసూయ మరో ఛానెల్‌లో కనిపించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అనసూయ ఏమనుకుంటోందనే న్యూస్ బయటపడి హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు చూద్దామా..

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
ఆ ఇద్దరి తర్వాత అనసూయనే..

ఆ ఇద్దరి తర్వాత అనసూయనే..

జబర్దస్త్ జడ్జిలుగా నాగబాబు, రోజా జబర్దస్త్ షోకి మూల స్తంభాలు అయితే.. వారిద్దరి తర్వాత సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ అనసూయ మాత్రమే. యాంకర్‌గా ఆమె చలాకీతనం బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ విందిస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో రక్తికట్టిస్తూ జబర్దస్త్ వేదికను వేడెక్కిస్తుంది అనసూయ. ఇక ఆమె అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అనసూయ కాంట్రాక్ట్ ఫినిష్

అనసూయ కాంట్రాక్ట్ ఫినిష్

గత కొన్నేళ్లుగా జబర్దస్త్ ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్, ఇకపై జబర్దస్త్ తెరపై కనిపించదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇంకొన్ని షోలు మాత్రమే చేసి అనసూయ బై బై అనేయనుందని, ఆమె కాంట్రాక్టు ఫినిష్ అయిందని టాక్ వినిపించింది. ఈ విషయమై అనసూయ స్పందించినప్పటీకీ వార్తలు ఆగడం లేదు.

అనసూయ మనసులో మాట..

అనసూయ మనసులో మాట..

పైగా అనసూయ.. జీ తెలుగులోని ఓ షోలో కనిపించడం, పక్కనే నాగబాబు కూడా ఉండటంతో ఈమె కూడా జబర్దస్త్ మానేసిందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ మనసులో మాట ఇదే అంటూ మరికొన్ని వార్తలు బయటకొస్తున్నాయి.

జబర్దస్త్ షోకి గుడ్ బై

జబర్దస్త్ షోకి గుడ్ బై

ఇప్పటికే తాను జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లుగానే చెబుతూ.. జబర్దస్త్‌ కామెడీ షోను వీడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తానని పేర్కొంది అనసూయ. ఈ మేరకు ఇకపై ఆమె రెండు ఛానళ్లలో రెండు షోలను బ్యాలెన్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదీ నాదే.. ఇదీ నాదే! అస్సలు వదలను

అదీ నాదే.. ఇదీ నాదే! అస్సలు వదలను

జబర్దస్త్ షోతో పాటు, జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ రెండూ నావే.. దేన్నీ వదలను అని అనసూయ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ జబర్దస్త్ సుందరి ఈ రెండు షోలను బ్యాలెన్స్ చేస్తూ ఎలాంటి కిక్కిస్తుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X