twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం.. నావరకైతే చేస్తున్నా.. మీరు: అనసూయ

    |

    నేటితరం సినీ సెలెబ్రిటీలు సామాజిక కార్యక్రమాల్లో పెద్దఎత్తున భాగమవుతున్నారు. వారి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా సామాజిక బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగిన విషయం. టెక్నాలజీ విస్తృతం కావడం, సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందటం కారణంగా ఇలాంటి కార్యాక్రమాల్లో సెలెబ్రిటీలు భాగం కావడానికి మార్గం సులువైంది.

    ప్రస్తుతం కావేరీ కాలింగ్ పేరిట మొక్కలు నాటే ఉద్య‌మం నడుస్తున్న సంగతి తెలిసిందే. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమానికి సెలెబ్రిటీలంతా తమ వంతు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కావేరీ కాలింగ్ విషయమై ఇటీవలే సమంత స్పందించగా, ఆ వెంటనే కాజల్ కూడా రియాక్ట్ అవుతూ వీడియో ద్వారా సందేశమిచ్చింది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సహకరించాలని వారు పిలునిచ్చారు.

    Anasuya Bharadwajs social Message goes viral on social media

    తాజాగా ఇదే బాటలో బుల్లితెర పాపులర్ యాంకర్, నటి అనసూయ ఓ వీడియో ద్వారా నెటిజన్ల ముందుకొచ్చింది. ''భారత దేశం నదులకు ప్రతీక. లాంటి భారత దేశంలో ఇలాంటి పరిస్థితి రావడం చాలా చాలా దురదృష్టకరం. ప్రతీ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందని సద్గురు అంటుంటారు. కావేరీ కాలింగ్ ఉద్యమంలో భాగంగా ఒక్క మొక్క నాటలంటే 42 రూపాయలు డొనేట్ చేయాలి. నా వంతుగా 10 వేల మొక్కలు నాటేందుకు డొనేట్ చేస్తున్నాను. మీరు కూడా మీ వంతు డొనేట్ చేయాలంటే cauverycalling.org ని సంప్రదించండి'' అని పేర్కొంది అనసూయ.

    English summary
    Anasuya Bharadwaj gave a social messege to her fans in twitter. She says please spend 42rs in cauverycalling.org to participate in social work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X