తప్పు చేసి క్షమాపణ చెప్పిన అనసూయ.. నా ఉద్దేశం అర్థం చేసుకోండి అంటూ ట్వీట్

ఒక్కోసారి అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. తప్పు చేయాలనే దృక్పథం లేనప్పటికీ అది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. అలా జరిగిన తప్పు వ్యక్తిగతం అయితే ఫర్వాలేదు.. కానీ పబ్లిక్‌గా జరిగిందంటే కష్టమే. ఇక ఇలాంటి సందర్భం సెలెబ్రెటీలకు జరిగితే మరీ కష్టం. వెంటనే ట్రోలింగ్ మొదలవుతుంది. అయితే తాజాగా యాక్టర్, నటి అనసూయ ఇలాంటి ఓ తప్పు చేసి వెంటనే సర్దుకుంది. పైగా క్షమాపణ కూడా చెప్పింది. వివరాల్లోకి పోతే..

Recommended Video

Anasuya Bharadwaj Fires On Netizens || ఎమోషనల్ అయిన అనసూయ
రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతిపెద్ద అటవీ ప్రాంతమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం కాన్సెప్ట్ ఇదే..

ప్రభుత్వం కాన్సెప్ట్ ఇదే..

నల్లమల అడవుల్లో భారీగా నిక్షేపితం అయి ఉన్న యురేనియం వెలికితీసి తద్వారా అణువిద్యుత్‌ను తయారు చేయాలనేది ప్రభుత్వం కాన్సెప్ట్. కానీ దీనిపై పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మీద, పర్యావరణం మీద పెను ప్రభావం పడుతుందని పేర్కొంటూ ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు.

వ్యతిరేఖించిన అనసూయ

వ్యతిరేఖించిన అనసూయ

యాంకర్, నటి అనసూయ కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేసింది. ''ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా.. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా?? అంటూ ట్వీట్ చేసింది అనసూయ.

దానికి కొనసాగింపుగా అనసూయ

దానికి కొనసాగింపుగా అనసూయ

ఆ తర్వాత దానికి కొనసాగింపుగా.. ''ఇదేగా మన భవిష్యత్తు?? ఎలా అల్లో చేస్తున్నారు సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?'' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను ట్వీట్‌లో ట్యాగ్ చేసింది అనసూయ.

తప్పు చేసిన అనసూయ

అయితే ప్రస్తుతం తెలంగాణలో జోగు రామన్న అటవీ శాఖ మంత్రి కాదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జోగు రామన్నకు స్థానం దక్కలేదు. ఆయన స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే అనసూయ పొరపాటు చేసింది.

తప్పు తెలుసుకొని క్షమాపణ చెబుతూ

తప్పు తెలుసుకొని క్షమాపణ చెబుతూ

ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న అనసూయ.. జోగు రామన్నకు క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేసింది. కరెంట్ అఫైర్స్‌పై తనకు పెద్దగా పట్టు లేదని, తన అజ్ఞానాన్ని మన్నించి తన ఇంటెన్షన్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X