Anasuya Bharadwaj Crying Video: వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ... అంతలా ఏం కష్టం వచ్చిందో?
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ఎంతో చలాకీగా ఉండే ఈ భామ.. ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న అనసూయ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏమైందో తెలియదు... ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడుస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఏమైంది మేడం అంటూ షాక్ అవుతున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
అనసూయలో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియాలో వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. అంతేనా అందాల ఆరబోతకు కాస్త లిమిట్స్ కేటాయించింది. ఇక మరోవైపు ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ... లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక మరోవైపు బుల్లితెరకు గుడ్ బై చెప్పిన అనసూయ.. వెండితెరపై మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. ఏమైందో తెలియదు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఓ వీడియో షేర్ చేసి షాక్ కు గురి చేసింది. ఆ వీడియోలో తను వెక్కి వెక్కి ఏడుస్తూ... కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఏమైందీ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియోలో మాత్రం అనసూయ సీరియస్ గా ఏడుస్తూ కనిపించింది. వీడియో షేర్ చేస్తూ...ఓ సుదీర్ఘ సందేషం కూడా పెట్టింది.
అనసూయ షేర్ చేసిన విషయం ఏమింటంటే... హలో ఉన్నారా!! మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను.. నా ఈ పోస్ట్‌కి చూస్తున్న మీరందరూ చాలా గందరగోళంగా ఉన్నారని నాకు తెలుసు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ మొదట్లో.. కనీసం నాకు తెలిసినంత వరకు.. ప్రపంచవ్యాప్తంగా.. ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి ఉపయోగించారు. సోషల్ మీడియాని ఒకరికొకరు అండగా ఉండండి.. సమాచారమందించే సాధనాలుగా యూజ్ చేసేవారు. అలాంటి విషయాలను పంచుకోండి. ఒకరి జీవనశైలి,సంస్కృతులను తెలుసుకోండి, ఆనందాన్ని పంచండి... అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఏం చెప్పిందంటే.... కానీ ఈరోజు.. వీటిలో ఏదైనా నిజంగా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఏది ఏమైనా.. ఈ పోస్ట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, సోషల్ మీడియాలో అన్ని పోజులు, ఫోటోషూట్‌లు, క్యాండిడ్స్.. చిరునవ్వులు.. నవ్వులు.. డాన్సులు.. బలమైన కౌంటర్లు, స్ట్రాంగ్ కం బ్యాక్ . మొదలైనవి ఇక్కడ నా జీవితంలో ఒక భాగమే, మీరు కూడా అలానే ఉన్నారు కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను, అలాగే నా జీవితంలోని ఈ దశలో నేను అంత బలంగా లేను.. నేను బలహీనంగా ఉన్నాను, నాకు కూడా బ్రేక్ డౌన్స్ ఉన్నాయి.. అంటూ వెల్లడించింది.

అనసూయ తాను న్యూట్రల్ ఆలోచనలు, డిప్లమసీ, డోంట్ కేర్ యాటిట్యూడ్, "బలమైన" అని ఆలోచించవలసి వచ్చింది. కానీ ఆ బలం యొక్క నా బలం కాదు, నా బలం ఇక్కడే ఉంది. బాగా ఏడుస్తూ లేచి, ఒకటి రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. ఇట్స్ ఓకే టు బీ నాట్ ఓకే కానీ, ఏది ముఖ్యమైనది అంటే రెస్ట్, రీబూట్.. కానీ నిష్క్రమించవద్దు. మరోవైపు.. నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా ఒకరు మీతో ఎలా ప్రవర్తించినా దయతో ఉండండి.. అంటూ సూచించింది. కొంచెం సెట్ అయ్యాక వారే తిరిగి వస్తారు, నన్ను నమ్మండి ఈ విషయాన్ని నేను నేను కష్టపడి నేర్చుకుంటున్నాను. అని ఆమె రాసుకొచ్చారు.
ఇక చివరిలో... నేను ఇప్పుడు బాగున్నాను, ఇది నా బ్యాడ్ డే గుర్తుంచుకోవడానికి నేను రికార్డ్ చేసిన వీడియో ఇది. 5 రోజుల క్రితందని రాసుకొచ్చారు. ఇక ఆమె పోస్ట్ ఉద్దేశం ఏమింటంటే... ఏడవాలి అనిపిస్తే ఏడ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి అని ఆమె రాసుకొచ్చింది. అనసూయ ఎందుకు ఏడ్చింది అనే విషయం మాత్రం తెలియడం లేదు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











