అనసూయను చుట్టుముడుతున్న రూమర్స్.. జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్
గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షో గురించిన టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకోవడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన బాటలోనే అనసూయ కూడా వెళ్తోందని, అతి త్వరలో ఆమె జబర్దస్త్ తెరపై కనుమరుగు కానుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఈ విషయమై తాజాగా అనసూయ రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అనసూయ
జడ్జి స్థానంలో నాగబాబు, రోజా జబర్దస్త్ షోకి మూల స్తంభాలుగా ఉంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా అనసూయ నిలిచేది. యాంకర్ గా ఆమె చేసే ప్రతీ పని బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ విందిస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో రక్తికట్టించడం ఆమె ప్రత్యేకత. అనసూయ అందాలు, ఆమెపై జబర్దస్త్ కంటిస్టెంట్స్ వేసే జోకులు ఈ షోలో బాగా హైలైట్ అవుతుంటాయి.

నాగబాబు దారిలోనే అనసూయ
అయితే ఇన్నాళ్లు జబర్దస్త్ ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. ఇంకొన్ని రోజుల్లో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేస్తుందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నాగబాబు దారిలోనే ఆమె కూడా జబర్దస్త్ వీడుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకొన్ని షోలు మాత్రమే చేసి అనసూయ బై బై అనేయనుందని, ఆమె కాంట్రాక్టు ఫినిష్ అయిందని టాక్ నడుస్తోంది.

అదిరిపోయే స్టెప్పులతో అనసూయ
సరిగ్గా ఈ తరుణంలో జీ తెలుగులో ప్రసారం కాబోతున్న షోలకు సంబంధించి ప్రోమోలు విడుదల కావడం, అందులో అనసూయ అదిరిపోయే స్టెప్పులతో అందరినీ మైమరిపిస్తూ మతి పోగొడుతుంది చూసి జనం షాక్ అవుతున్నారు. దీంతో ఇక అనసూయ జబర్దస్త్ కంప్లీట్ గా వీడుతుండటం నిజమే అనే అభిప్రాయానికి వస్తున్నారంతా.
అనసూయ ఘాటు స్పందన
ఈ నేపథ్యంలో తానూ జబర్దస్త్ వీడబోతున్నట్లు వస్తున్న వార్తలనుపై అనసూయ కాస్త ఘాటు గానే స్పందించింది. ఆ దేవుని దయవల్ల తాను జబర్దస్త్ అనసూయగా చాలా బాగున్నానని, జబర్దస్త్ నుండి వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై త్వరలో క్లారిటీ ఇస్తానని పేర్కొంటూ ఊహించని రీతిలో కామెంట్స్ చేసింది.
Recommended Video

స్టాప్ జాబ్ లెస్ న్యూస్ అంటూ ఫైర్
దయచేసి నా నుండి వచ్చే సున్నితమైన సమాధానాలను వినండి. నేను ఇచ్చే సమాధానాలు వాళ్లని శాంత పరుస్తుంది. నేను ఎవరి నుంచి మాట్లాడుతున్నాను వాళ్లకి క్లియర్‌గా తెలుసు. ''స్టాప్ జాబ్ లెస్ న్యూస్, గెట్ ఏ లైఫ్'' అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది అనసూయ భరద్వాజ్. దీంతో ఇంతకీ అనసూయ జబర్దస్త్ వీడుతోందా? లేదా? అనే దానిపై అయోమయం నెలకొంది.


Click it and Unblock the Notifications











