twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కళ్యాణ్‌ని చూస్తూ అనసూయ ఫీలింగ్స్.. బర్త్ డే స్పెషల్ ట్వీట్ అదిరిందిలే!

    |

    పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.. ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన ఆయన ఆనతి కాలంలోనే టాప్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్‌తో భారీ అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. అలాంటి పవన్.. ఈ రోజు (సెప్టెంబర్ 2) తన 48వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ బాగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది? వివరాల్లోకి పోతే..

    ఇటు యాంకర్ అనసూయ, అటు రంగమత్త

    ఇటు యాంకర్ అనసూయ, అటు రంగమత్త

    కేవలం బుల్లితెరనే కాదు వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెరుచుకుంది అనసూయ. బుల్లితెర హోస్ట్‌గా రాణిస్తూనే వెండితెరపై కాలుమోపిన ఈ భామ అక్కడ కూడా భారీ పాపులారిటీ సంపాదించింది. పలు సినిమాల్లో మెప్పించిన ఆమెకు ఇటు యాంకర్ అనసూయగా, అటు రంగమత్తగా ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.

    నెట్టింట యమ యాక్టివ్.. ఏదీ వదలదు

    నెట్టింట యమ యాక్టివ్.. ఏదీ వదలదు

    ఇక అనసూయ యాక్టివ్‌నెస్ గురించి చెప్పుకుంటే.. బుల్లితెర, వెండితెర మాత్రమే కాదు నెట్టింట కూడా ఆమె హంగామా మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్ లో ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, పండుగ శుభాకాంక్షలు, సెలెబ్రిటీల పుట్టినరోజు విషెష్ అన్నీ పంచుకుంటూనే ఉంటుంది. ఇదే కోవలో తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వండర్‌ఫుల్ పిక్ షేర్ చేసింది అనసూయ.

    హ్యాపీ బర్త్ డే పవన్ అంటూ.. తెగ సిగ్గు పడిపోతోంది

    ట్విట్టర్ వేదికగా ''విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు'' అని పేర్కొన్న అనసూయ.. తన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఓ సందర్భం తాలూకు పిక్ షేర్ చేసింది. ఆమె గురించి పవన్ చెబుతుంటే ఆయన వైపే చూస్తూ తెగ సిగ్గుపడుతున్నట్లుగా ఈ పిక్‌లో కనిపించింది అనసూయ. దీంతో ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

    అది రంగమ్మత్త సమయం..

    అది రంగమ్మత్త సమయం..

    ఇంతకీ ఆ పిక్ ఎప్పటిదంటారా? అదేనండీ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ మ్యాజిక్ చేసింది చూడండి అప్పటిదే. ఆ సమయంలో ఓ కార్యక్రమంలో భాగంగా ఇలా పవన్ కళ్యాణ్, అనసూయ (రంగమ్మత్త) గురించి మాట్లాడారు. అనసూయ షేర్ చేసిన ఆ పిక్‌లో డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నారు.

    బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న పవన్

    బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న పవన్

    ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడం ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అవుతోంది. పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.

    English summary
    Pawan Kalyan is actor who showing more impact over young star with his positive attitude. Within shot gap he turned into major icon of all Telugu people. Today his 48th Birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X