Anasuya: కోటా పేరు తేకుండానే ఘాటు కామెంట్లు.. ఆడవాళ్ళతో అలా.. దాన్ని ఎలా సమర్థింకుంటారు అంటూ?
ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ కారణంగా వార్తలలోకి ఎక్కే అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల మరోసారి వార్తల్లోకెక్కింది.. అయితే ఈ సారి ఆమె సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. అనసూయ పొట్టి బట్టల గురించి కోట శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేయగా అంతకన్నా ఘాటుగా స్పందిస్తూ అనసూయ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

లైన్ లోకి కోటా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి కోట శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. దీంతో కోట శ్రీనివాసరావు ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు అనసూయ డ్రెస్సింగ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో అనసూయ ఎవరో తనకు తెలియదు అని పేర్కొన్నా కోటశ్రీనివాసరావు అనసూయ మంచి నటి అని, అవి ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

మంచి నటి అంటూనే బట్టల మీద కామెంట్లు
అనసూయ మంచి నటి అని, చక్కగా హావభావాలు పలికిస్తారని, చక్కగా డాన్సులు చేస్తారని చెప్పిన కోట.. ఆవిడ వేసుకునే డ్రెస్సులు తనకు నచ్చవని అన్నారు. సాధారణంగానే తన డ్రస్సులు గురించి ఎవరు కామెంట్ చేసిన వారిని చీల్చి చెండాడే అనసూయ భరద్వాజ్ ఈ విషయంపై స్పందించారు. కోట శ్రీనివాసరావు పేరుని ప్రస్తావించకుండా ఆయన తీరుని ట్విట్టర్ వేదికగా బాహాటంగా విమర్శించారు. ''రీసెంట్‌గా ఓ సీనియర్ యాక్టర్ నాపై కొన్ని కామెంట్స్ చేశారని తెలిసిందనీ మొదలు పెట్టిన ఆమె ఘాటు విమర్శలు చేసింది.

చాలా చిన్నతనంగా అనిపిస్తోంది
ఆయన నా వస్త్రధారణ గురించి మాట్లాడారు. అనుభవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా చిన్నతనంగా ఉందని, తనకు చాలా దుఃఖాన్ని కలిగించిందనీ పేర్కొంది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం, వృత్తిపరమైన పరిస్థితులను అనుసరించి కూడా అలా వేసుకోవాల్సి రావచ్చు. అది వారి పూర్తి వ్యక్తిగతమైన విషయం. కానీ సోషల్ మీడియా అలాంటి వార్తలను ప్రచారం చేస్తుంది.

సోషల్ మీడియా అలా ఎందుకు ప్రశ్నించదు?
అలాంటి సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వానమైన దుస్తులను ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అని ఎప్పుడైనా సోషల్ మీడియా ప్రశ్నించిందా ? అని ఆమె ప్రశ్నించింది. ఆయన తెర మీద స్త్రీలను కించపరిచిన సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి వార్తలను సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోలేదనేది ఆశ్చర్యకరంగా అనిపిస్తుందనీ అనసూయ పేర్కొంది.
Recommended Video

వాళ్లని ఎందుకు ప్రశ్నించరు?
ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, పిల్లలను కలిగి ఉన్నారో, సిల్వర్ స్క్రీన్‌పై నటీమణులతో రొమాన్స్ చేస్తున్నారో, షర్టులు వేసుకోండా తన దేహాన్ని చూపించే హీరోల గురించి మాత్రం ఎవరూ ఎందుకు ప్రశ్నించరు? నేనొక పెళ్లైన స్త్రీని,.. ఇద్దరు పిల్లల తల్లిని.. నా వృత్తిలో విజయాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాను, పితృ శ్వమ్యాన్ని ప్రశ్నిస్తూ పని చేస్తున్న నా మీద మీ పెత్తనం ఏంటి? అయితే మీరు మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడం కంటే మిమ్మల్ని మీరు ముందు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి'' అని ట్వీట్ చేసింది అనసూయ. అయితే ఇక్కడ ఎక్కడా కూడా అనసూయ కోట శ్రీనివాస రావు పేరు ప్రస్తావించకపోయినా ఆయన గురించి ఆమె కామెంట్లు చేసింది అనేది సుస్పష్టం.


Click it and Unblock the Notifications











