చిన్మయికి అనసూయ సపోర్ట్.. నాలో బలం పెరిగిందంటూ
ప్రేమికులను ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరుగా ఫైర్ అవుతూ వస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ప్రేమికులు అన్నాక ముద్దు ముచ్చటతో పాటు కొట్టుకుంటేనే వారి మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్లు అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇది చూసిన సమంత, చిన్మయి.. సందీప్ వ్యాఖ్యలు మహిళలను అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని పేర్కొంటూ ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి సందీప్ తీరును తప్పు బట్టారు.
సందీప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన చిన్మయి.. ప్రేమికుల మధ్య కొట్టుకోవడం ఉంటేనే నిజమైన ప్రేమ ఉందని చెప్పడం సరికాదని తెలిపింది. తాను తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, అయితే తన భర్త ఎప్పుడూ తనను ఒక్క మాట కూడా అనలేదని పేర్కొంది చిన్మయి. ఈ లెక్కన మా మధ్య ప్రేమ లేనట్లేనా? అని చిన్మయి ఘాటు సందేశం పోస్ట్ చేసింది. అయితే ఈ సందేశం చూసిన అనసూయ చిన్మయికి సపోర్ట్‌గా నిలిచింది.

సందీప్ రెడ్డి వంగా గతంలో కూడా ఇలాగే మహిళలను అవమానించే మాటలు మాట్లాడాడని అనసూయ గుర్తుచేసింది. అర్జున్ రెడ్డి విడుదల సమయంలో కూడా సందీప్ రెడ్డి వంగా ఇలాగే మాట్లాడితే తాను ఖండించానని, అయితే ఆ సమయంలో చిన్మయి తనకు అండగా నిలువకపోయినప్పటికీ, ఇప్పుడైనా రియాక్ట్ కావడం తనకు కొండంత బలాన్నిచ్చిందని అనసూయ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
టాలీవుడ్‌లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్‌గా కబీర్ సింగ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా ఇలాంటి వివాదాస్పద చేశాడు. ఇక కబీర్ సింగ్ సినిమా విషయానికొస్తే.. షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమెస్ట్రీ.. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. తొలి రోజే పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్న బీ టౌన్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయి 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది 'కబీర్ సింగ్'.


Click it and Unblock the Notifications











