16 ఏళ్ల వయసు నుంచే ఆయనతో అటాచ్‌మెంట్.. మరెవ్వరికీ ఛాన్స్ లేదు: అనసూయ

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ బెస్ట్ హోస్ట్‌గా ప్రశంసలందుకుంటూనే వెండితెరపై కాలు మోపింది. క్షణం సినిమాతో తనలోని టాలెంట్ పరిచయం చేసిన ఈమె సినిమా సినిమాకు తన నటనా ప్రతిభను మెరుగుపరుస్తూ వచ్చింది. రంగస్థలం సినిమాతో భారీ క్రేజ్ కొట్టేసింది. పెళ్లై ఇద్దరు పిల్లల్లునా కూడా హాట్ హాట్ ఫొటోస్‌తో కవ్వించే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

సినిమాలు, టీవీ షోస్ బ్యాలెన్స్ చేస్తూ

సినిమాలు, టీవీ షోస్ బ్యాలెన్స్ చేస్తూ

ప్రస్తుతం నటిగా సినిమాలు చేస్తూనే, పలు టీవీ షోస్ ద్వారా జబర్దస్తీ చేస్తోంది అనసూయ. ఇటీవలే 'కథనం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేవ‌లం గ్లామర్ పాత్రలే కాదు, లీడ్ రోల్ న‌టిగా కూడా మెప్పించగలనని ఈ సినిమా ద్వారా తెలిపింది అనసూయ.

ధన్‌రాజ్‌తో కలిసి అనసూయ

ధన్‌రాజ్‌తో కలిసి అనసూయ

కాగా ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ధనరాజ్‌తో కలిసి అనసూయ పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ధనరాజ్ అడిగిన ప్రశ్నలపై ఆసక్తికరంగా స్పందించింది అనసూయ. మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ముందుగా ఎవరిని కాంటాక్ట్ చేస్తారని ఆయన అడిగిన ప్రశ్నపై.. ఇంకెవరికి మా ఆయనకే చేస్తా అని వెంటనే అనసూయ సమాధానం చెప్పేసింది అనసూయ.

16 ఏళ్ల వయసు నుంచే

16 ఏళ్ల వయసు నుంచే

తనకు 16ఏళ్ల వయసు నుంచే తన భర్తతో మంచి అటాచ్‌మెంట్ ఏర్పడిందని, తన లైఫ్ లో ఆయనకు తప్ప ఇంకెవరికి చోటు లేదని పేర్కొంటూ భర్తపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది అనసూయ. తన కుటుంబం అంటే ఎంతో ఇష్టపడే అనసూయ గతంలో కూడా చాలాసార్లు తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.

కథనం తర్వాత మరో సినిమా

కథనం తర్వాత మరో సినిమా

'కథనం' సినిమా తర్వాత తాను మరో సినిమాకు కమిటయ్యానని అంటున్న అనసూయ.. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలిపింది. విలక్షణ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని నమ్ముతున్నట్లుగా పేర్కొంది అనసూయ.

చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టులో

చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టులో

ఇకపోతే సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న కొత్త ప్రాజెక్టులో అనసూయ కీలక పాత్ర పోషించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో అతి త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో అనసూయ జాయిన్ కానుందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X