విజయ్ దేవరకొండపై అనసూయ సంచలన ట్వీట్: దొంగ ** అంటూ మరొకటి.. ఆంటీ వాళ్ల దగ్గర డబ్బు తీసుకోలేదా అంటూ!

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ భామ సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తోంది.

అదే సమయంలో అనసూయ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక అంశంపై స్పందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇదో వివాదంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

Anasuya Bharadwaj Tweet on Vijay Deverakonda Name Creates Controversy

అనసూయ చేసిన ట్వీట్ ఇదే: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే 'ఇప్పుడే ఒకటి చూశాను. ది (THE) నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం? అంటకుండా చూసుకోవడమే' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఇది పెద్ద దుమారాన్నే రేపింది.

విజయ్ పేరును టార్గెట్ చేసి: యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన టాలీవుడ్ ట్వీట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించిందే అని అందరికీ అర్థం అవుతోంది. దీనికి కారణం అతడు ప్రస్తుతం నటిస్తోన్న 'ఖుషి' మూవీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో 'The విజయ్ దేవరకొండ' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడిదే The ను ఉద్దేశించి అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసిందని చెప్పుకోవచ్చు.

Anasuya Bharadwaj Tweet on Vijay Deverakonda Name Creates Controversy

ట్రోల్స్ చేస్తోన్న రౌడీ ఫ్యాన్స్: అనసూయ భరద్వాజ్ ట్విట్టర్‌లో చేసిన పోస్టుపై విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆమెను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరోసారి 'ఆంటీ' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ అనసూయను ట్రోట్స్ చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

నిజాన్ని నిరూపిస్తున్నారని: తనను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై యాంకర్ అనసూయ భరద్వాజ్ ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందించింది. ఈ మేరకు తన ఖాతాలో 'భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ ఊప్స్.. బంగారు కొండలంట.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది నిరూపిస్తున్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు' అంటూ రాసుకొచ్చింది.

Anasuya Bharadwaj Tweet on Vijay Deverakonda Name Creates Controversy

డబ్బు తీసుకున్నావు కదా: ఇక, అనసూయ చేస్తున్న వరుస ట్వీట్లపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరింతగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మేరకు ఆమెను ఉద్దేశిస్తూ.. 'నువ్వు అదే THE ప్రొడక్షన్ నుంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నావు గుర్తు లేదా'.. 'దారినపోయే కంపను **కి తగిలించుకోవడం అంటే ఇదే'.. 'హాయ్ ఆంటీ బాగున్నావా'.. 'ఆంటీ కొంచెం ఆగు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anasuya Bharadwaj Tweet on Vijay Deverakonda Name Creates Controversy

గతంలోనూ ఇలాగే గొడవ: ఇప్పుడే కాదు.. గతంలో కూడా అనసూయ - విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య పలుమార్లు ఇలాగే వివాదాలు చెలరేగాయి. అప్పుడు కూడా ఆమె స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయింది. అందుకు తగ్గట్లుగానే వాళ్లు కూడా 'ఆంటీ' అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అంతేకాదు, ఇదే హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యేలా చేశారు. అదే రైవర్లీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X