twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకు ఇలాంటి మాటలు: అనసూయ

    |

    అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై బట్టిపాటి నరేంద్రరెడ్డి, సర్మా చుక్క నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

    విజయ దశమి సందర్భంగా ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ అనసూయ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అయితే పోస్టర్ చూసిన చాలా మంది ఇది లేడీ ఓరియెండ్ సినిమా అని, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయి ఉంటుందని వ్యాఖ్యానించడంతో ఆమెకు కోపం వచ్చింది.

    ఎందుకు ఇలాంటి కామెంట్స్

    నా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా ప్రశ్నలు వేస్తుంటారు. ఒక సినిమాను మేల్ యాక్టర్ లీడ్ చేస్తే, ఆయన ఫోటోలతో పోస్టర్ రిలీజ్ చేస్తే ఎవరూ దాన్ని మేల్ ఓరియెంటెడ్ సినిమా అనరు. అదే ఫిమేల్ యాక్టర్ లీడ్ రోల్ చేస్తే ఆమె ఫోటోతో పోస్టర్ రిలీజ్ చేస్తే దాన్ని ఫిమేల్ ఓరియోంటెడ్, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటూ కామెంట్ చేస్తారు... అంటూ అనసూయ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు

    నేను చెప్పే విషయాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం అందరం దీని గురించి జెన్యూన్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నటుల పని తమకు ఇచ్చిన క్యారెక్టర్స్ లో నటించడమేకదా. ఏ సినిమాలో అయినా ఆయా పాత్రల పరిధి మేరకు అవి ముఖ్యమైన పాత్రలే. మేల్ పాత్రలు లేకుండా ఫిమేల్ పాత్రలు, ఫిమేల్ పాత్రలు లేకుండా మేల్ పాత్రలు పండవు... ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అనసూయ అన్నారు.

    అలా పిలిస్తే సరిపోతుంది కదా

    మేమంతా సినిమాల్లో పాత్రల్ని పోషిస్తున్నాం. సరైన విధంగా మమ్మల్ని పిలవాలిస్తే బావుంటుంది. అంతే కానీ ఫిమేల్ ఓరియెంటెడ్, లేడీ సెంట్రిక్ అని పిలవడం సరికాదు. అందులో ఎవరు లీడ్ రోల్ చేస్తే ఆమె లీడ్ రోల్ చేస్తున్న సినిమా, లేదా అతడు లీడ్ రోల్ చేస్తున్న సినిమా అంటే సరిపోతుంది కదా... అంటూ అనసూయ వ్యాఖ్యానించారు

    కథనం

    ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. ‘క్షణం' తర్వాత అనసూయ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రమిది.

    English summary
    "So my question is.. when any film releases having the male actor as the main/lead actor on the poster.. no one says male oriented.. but if the same happens with a female actor as the lead actor on the poster why the terms come up like “female-oriented” “women-oriented” etc?? Please don’t take me wrong.. its a genuine concern.. all of us.. as actors play characters kada.. every character is important in its own space.. the contribution is important be it male female supporting male supporting female comedian male comedian female..phew! We all are playing chatacters.. I guess the right addressing should be like “so and so in the main lead” or “she and him as the lead actors” etc.. fair enough no??." Anasuya Bharadwaj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X