twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడవిలో అనసూయ.. దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ పబ్లిక్‌గా వేడుకున్న జబర్దస్త్ బ్యూటీ

    |

    నేటితరం సినీ సెలెబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన వివరాలు నెటిజన్ల ముందుంచుతున్నారు. ఆ కోవకు చెందిన సెలెబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. ఈ నేపథ్యంలో ''దేవుడా మమ్మల్ని కాపాడు'' తాజాగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

    కొత్త సంవత్సరం.. కాస్త బిన్నంగా అనసూయ

    కొత్త సంవత్సరం.. కాస్త బిన్నంగా అనసూయ

    కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా గోవా వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. గోవా వెళ్లి అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా ఫారెన్ టూర్ వేస్తుంటారు. అయితే అనసూయ మాత్రం కొత్త సంవత్సరాన్ని కాస్త బిన్నంగా సెలెబ్రేట్ చేసుకుంది.

    ఫారెస్ట్‌లో అనసూయ ఎంజాయ్

    ఫారెస్ట్‌లో అనసూయ ఎంజాయ్

    న్యూ ఇయర్ సందర్బంగా అనసూయ అడవికి వెళ్ళింది. ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ ఫారెస్ట్ లోని రిసార్ట్స్ లో న్యూఇయర్ ను సెలెబ్రేట్ చేసుకుంది ఈ జబర్దస్త్ భామ. ఫ్యామిలీతో కలిసి ఫారెస్ట్ టూర్ వేసిన ఈమె అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

    వీడియో ద్వారా అనసూయ రిక్వెస్ట్

    వీడియో ద్వారా అనసూయ రిక్వెస్ట్

    ఈ మేరకు ''దేవుడా మమ్మల్ని కాపాడు'' అంటూ ఓ వీడియోను అనసూయ రీట్వీట్‌ చేయడం హాట్ టాపిక్ అయింది. అనసూయ ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక పెద్ద కారణం ఉంది. ప్రకృతి విలయానికి సంబంధించి అనసూయ ఇలా రియాక్ట్ అయింది.

    చెలరేగిన మంటలు.. అటవీ ప్రాంతం బూడిదైపోయింది

    చెలరేగిన మంటలు.. అటవీ ప్రాంతం బూడిదైపోయింది

    ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న కార్చిచ్చు ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఆస్ట్రేలియా మంటల్లో చిక్కుకుంది. 1.45కోట్ల ఎకరాల అటవీ ప్రాంతం బూడిదైపోయింది. ఈ మంటల్లో చిక్కుకొని 50కోట్లకు పైగా మూగజీవాలు చనిపోయాయి. వాతావరణ మార్పు ఇది అని తెలుపుతూ ఎర్త్‌ సంస్థ ఆస్ట్రేలియా కార్చిచ్చు వీడియోను ట్వీట్‌ చేసింది.

    కోట్లాది పక్షులు, జంతువులతో పాటు మంటల్లో

    ఈ వీడియో చూసిన అనసూయ చలించిపోతూ.. దేవుడా మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ఆ వీడియోను రీట్వీట్‌ చేసింది. కోట్ల ఎకరాల అటవీ ప్రాంతంతో పాటు, ఇలా కోట్లాది పక్షులు, జంతువులు మంటల్లో కాలి బూడిదైపోవడంపై పర్యావరణ, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఇలాగే న్యూ సౌత్‌వేల్స్‌, క్వీన్స్‌లాండ్‌లో కార్చిచ్చు ప్రకృతి విలయం సృష్టించింది.

    English summary
    Hot Anchor Anasuya Bharadwaj enjoyed new year celebrations in forest. Now she tweeted ''Oh my God!!! Please save us!!''.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X