వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’లో అనసూయ లుక్ ఇదే!
Recommended Video

'రంగస్థలం'లో రంగమ్మత్తగా పాపులర్ అయిన తర్వాత అనసూయ సినీ కెరీర్ గ్రాఫ్ వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. వైఎస్ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'లోనూ ఆమె కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా అనసూయ 'యాత్ర' షూటింగుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటో ఆమె మొహం కనిపించకుండా కేవలం వెనక వైపు నుంచి మాత్రమే కనిపిస్తోంది. ఆమె ఇందులో ఎవరి పాత్ర పోషిస్తున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది.

కర్నూలు రాజకీయ నాయకురాలు, చీరకట్టు అలానే ఉంది...
‘యాత్ర' మూవీలో కర్నూలు జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మహిళా నేత పాత్రలో అనసూయ నటిస్తోందని సమాచారం. కర్నాలు జిల్లాలోని సదరు ముఖ్య నేత తరహాలోనే అనసూయ చీరకట్టులో ఉండటంతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది.

జర్నలిస్ట్ అనే మరో ప్రచారం కూడా
అయితే అనసూయ ఇందులో జర్నలిస్టులో కనిపించనుందనే మరో ప్రచారం కూడా ఉంది. అయితే చిత్ర యూనిట్ నుంచి కానీ, అనసూయ నుంచి ఈ పాత్రపై అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ లేక పోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

పాదయాత్రలో భాగమైన అందరూ
వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60 రొజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాతను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'యాత్ర' సినిమా ఉంటుంది. ఆ యాత్రలో భాగమైన ముఖ్యులందరి పాత్రలు ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారు.

యాత్ర
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు. 70ఎంఎం పిక్చర్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











