పవన్ కల్యాణ్ ట్వీట్‌తో అనసూయకు మూర్ఛ.. ఇక ఆ డైరెక్టర్ పరిస్థితి అయితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన బర్త్ డే కావడంతో సాధారణ నెటిజన్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల వరకు తమ విషెస్‌ను సోషల్ మీడియా ద్వారా అందించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు అందజేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కల్యాణ్ సమాధానాలిస్తూ థ్యాంక్స్ చెబుతున్నారు. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లకు అనసూయ, వెంకీ కుడుముల లాంటి సినీ ప్రముఖులు సంతోషంలో మునిగిపోయారు.

అనసూయ గారు.. మీరు క్షేమంగా ఉండాలి
తను పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేసిన యాంకర్, యాక్టర్ అనసూయ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అనసూయ గారు.. హృదయపూర్వకంగా మీరు శుభాకాంక్షలు అందించినందుకు థ్యాంక్యూ. మీరు ఆరోగ్యంతోపాటు సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

నాకు మూర్ఛ వచ్చినంత పని..
పవన్ కల్యాణ్ నుంచి ఊహించని రిప్లై రావడంతో యాంకర్ అనసూయ సంతోషంలో మునిగిపోయారు. తన ఆనందాన్ని పట్టలేక వెంటనే పవన్ కల్యాణ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. నాకు మూర్ఛ పోయినంత పనైంది అంటూ ట్వీట్ చేశారు. తాను అభిమానించే పవన్ కల్యాణ్ నుంచి ఇలాంటి సందేశం రావడంతో తన ఆనందాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకొన్నారు.

వెంకీ కుడుముల బర్త్ డే విషెస్
ఇక హలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల ఆనందం మరోస్థాయిలో ఉంది. పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున.. స్ఫూర్తిదాయకమైన స్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సినిమాల ద్వారా గొప్ప ఎనర్జీని మాకు అందించారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాలం జీవించాలి ఆయన ట్వీట్ చేశారు.
Recommended Video

భీష్మ లాంటి మరో సినిమా రావాలి.. పవన్ కల్యాణ్ ట్వీట్
దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్‌కు సమాధానంగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి.. డియర్ వెంకీ గారు.. మీ విషెస్ థ్యాంక్యూ. భీష్మ లాంటి మరో మంచి ఎంటర్‌టైనర్‌ను ఆశిస్తున్నాను అని అన్నారు. దీంతో వెంకీ కుడుముల.. వావ్.. రోమాలు నిక్కపోడియాయి. నాకు ఇది ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఎంతో సమయాన్ని వెచ్చించి నాకు రిప్లై ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. అందుకు థ్యాంక్స్. భీష్మ రిలీజ్ తర్వాత మీరు చెప్పిన కంగ్రాట్స్ ఇంకా మరిచిపోలేదు.. లవ్ యూ సార్ అంటూ వెంకీ కుడుముల మరో రిప్లై ఇచ్చారు.


Click it and Unblock the Notifications











